Viral: పొట్టకు బ్యాండేజ్‌తో బరిలోకి.. బౌలర్లపై బౌండరీల ఊచకోత.. సలాం చేస్తోన్న నెటిజన్స్..

Royal Challengers Bangalore vs Chennai Super Kings, Faf du Plessis Viral Photo: ఈ మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫొటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో అతను తన పొట్టపై​ఓ బ్యాండేజ్‌తో కనిపించాడు. ఇదే బ్యాండేజ్‌తో జట్టు తరపున చెన్నై బౌలర్లను చితకబాది.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Viral: పొట్టకు బ్యాండేజ్‌తో బరిలోకి.. బౌలర్లపై బౌండరీల ఊచకోత.. సలాం చేస్తోన్న నెటిజన్స్..
Faf Du Plessis Viral

Updated on: Apr 18, 2023 | 3:26 PM

RCB Captain Faf Du Plessis Viral Photo: ఐపీఎల్ 16లో నిన్న (ఏప్రిల్ 17) చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. దీంతో ఆర్‌సీబీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి బలమైన బ్యాటింగ్ కనిపించింది. దీంతో ఇరు జట్లు 200 పరుగుల స్కోరును దాటాయి. ఈ మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫొటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో అతను తన పొట్టపై​ఓ బ్యాండేజ్‌తో కనిపించాడు. ఇదే బ్యాండేజ్‌తో జట్టు తరపున చెన్నై బౌలర్లను చితకబాది.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

కడుపు నొప్పి రావడంతో..

ఈ మ్యాచ్‌లో RCB పరుగుల వేటలో ఉంది. ఈ సమయంలో, జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. బాధతో ఉన్న కెప్టెన్‌ను చూసిన జట్టు ఫిజియో వెంటనే గ్రౌండ్‌కి వచ్చి ఫాఫ్‌ పొట్టకు బ్యాండేజీ కట్టాడు. డు ప్లెసిస్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించింది. బాధలో ఉన్నప్పటికీ, ఫాఫ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగులు రాబట్టాడు. RCB కెప్టెన్ 33 బంతుల్లో 187.88 స్ట్రైక్ రేట్‌తో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ అనంతరం డు ప్లెసిస్ ఏమన్నాడంటే..

ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం డు ప్లెసిస్ వెల్లడించాడు. “ఫీల్డింగ్ సమయంలో, నా పక్కటెముకకు గాయమైంది. అందుకే కట్టు కట్టారు. మేం బాగా బ్యాటింగ్ చేశాం. కానీ, చివరి నాలుగు ఓవర్లలో, మేం మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చుకోలేకపోయాం. టాస్‌ సమయంలోనే ఇక్కడ 200 స్కోరు వచ్చిందని చెప్పాను. గౌరవప్రదమైన స్కోరు కంటే 10-15 పరుగులు ఎక్కువగా వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..