Ravindra Jadeja: టీ20 క్రికెట్‌లో జడ్డూ ‘డబుల్ సెంచరీ’.. భారత్ తరఫున 9వ ఆటగాడిగా ఆ లిస్టులోకి..

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. అయితే చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు అజేయగా 25 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ఈ రెండు..

Ravindra Jadeja: టీ20 క్రికెట్‌లో జడ్డూ ‘డబుల్ సెంచరీ’.. భారత్ తరఫున 9వ ఆటగాడిగా ఆ లిస్టులోకి..
Ravindra Jadeja Completes His 200 Wickets In T20 Format

Updated on: Apr 13, 2023 | 6:30 AM

IPL 2023, Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్‌లలో రవీంద్రజడేజాకు ప్రముఖమైన స్థానం ఉందంటే అతిశయోక్తి కానేకాదు. ఫార్మాట్ ఏదైనా తన స్పిన్‌తో, బ్యాట్‌తో రాణించడం సర్ జడేజాకు వెన్నెతో పెట్టిన విద్య. ఇక అదే విద్యను ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలోనూ కనబరుస్తున్నాడు జడ్డూ. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. అయితే చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు అజేయగా 25 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ఈ రెండు వికెట్లతో జడేజా టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో 9వ ఓవర్ వేసిన జడేజా మూడో బంతికి దేవ్‌దత్ పడిక్కల్‌ని, 5వ బంతికి సంజూ శామ్సన్‌ని ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

అయితే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడిగా కూడా అవతరించాడు. జడేజా కంటే ముందు యజ్వేంద్ర చాహల్(307), రవిచంద్రన్ అశ్విన్(291), పియూష్ చావ్లా(280), అమిత్ మిశ్రా(275), భువనేశ్వర్ కుమార్(258), జస్ప్రీత్ బూమ్రా(256), హర్భజన్ సింగ్(235), జయదేశ్ ఉనాద్కట్(210) ఉన్నారు. ఇప్పుడు 200 టీ20 వికెట్లు పూర్తి చేసుకున్న జడేజా కూడా ఈ లిస్టులో చేరాడు. మరోవైపు జడేజా టీ20 క్రికెట్‌లో 3198 పరుగులు చేశాడు. వీటిలో అంతర్జాతీయ క్రికట్‌లో సాధించిన 457 పరుగులు కూడా ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..