IPL 2023: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయంతో ఏడాది దూరమైనా.. రీఎంట్రీతో 30 ఏళ్ల రికార్డుకు బ్రేకులు.. ఎవరంటే?

|

Feb 02, 2023 | 11:43 AM

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రెండో మ్యాచ్‌లోనే 30 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి, తొలి ఇంగ్లీష్ బౌలర్‌గా నిలిచాడు. దీంతో ముంబై టీం ఆనందంలో మునిగిపోయింది.

IPL 2023: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయంతో ఏడాది దూరమైనా.. రీఎంట్రీతో 30 ఏళ్ల రికార్డుకు బ్రేకులు.. ఎవరంటే?
Ipl 2023 Mumbai Indians
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 అంటే రాబోయే సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) స్టార్ ప్లేయర్లలో ఒకరు తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. దీంతో ముంబై టీం ఫుల్ ఖుషీలో నిలిచింది. 5 సార్ల ఐపీఎల్ ఛాంపియన్‌ టీంగా నిలిచిన ముంబై.. 2022లో మొదటిసారి లీగ్‌లో దిగువ స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ టీం స్టార్ బౌలర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఫాంలోకి వచ్చాడు.

ఫామ్‌లోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 వేలంలో రూ. 8 కోట్లతో ఈ స్టార్ ఇంగ్లండ్ బౌలర్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. బుధవారం (ఫిబ్రవరి 1) జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్ తరపున ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా, 2022లో గాయాలతో పోరాడిన ఆర్చర్.. ప్రస్తుతం బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మొదట బ్యాటింగ్ చేసి, జోస్ బట్లర్ ధాటికి ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 346/7 స్కోర్ చేసింది. బట్లర్ 127 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. డేవిడ్ మలన్ కూడా 118 పరుగులతో సత్తా చాటాడు.

అనంతరం ఆర్చర్ ప్రదర్శనతో సౌతాఫ్రికా టీం 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టాడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్‌ పడగొట్టి, సౌతాఫ్రికాను 43.1 ఓవర్లలో 287 పరుగులకే ఆలౌట్ చేశారు.

జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి తిరిగి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఈ ఇంగ్లండ్ పేసర్ 30 ఏళ్ల రికార్డును ధ్వంసం చేశాడు. జోఫ్రా ఆర్చర్ 9.1 ఓవర్లలో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాలో నెలకొల్పిన 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో ఏ విదేశీ బౌలర్ చేయని అత్యుత్తమ ప్రదర్శనగా ఆర్చర్ సొంతం చేసుకున్నాడు. 30 ఏళ్ల క్రితం వసీం అక్రమ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 1993లో దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై అక్రమ్ 16 పరుగులకు 5 వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికాలో ఆర్చర్ అద్భుతం చేశాడు. అతను విదేశీ గడ్డపై ఆడిన వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో ఇంగ్లీష్ బౌలర్‌గా కూడా నిలిచాడు. 12 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో క్రిస్ వోక్స్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..