MS Dhoni, IPL 2023 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ చివరి రోజుకు చేరుకుంది. మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ 2023 టోర్నీ తుది రోజుకు చేరుకోవడంతో.. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం కూడా సిద్ధంగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 4 సార్లు ట్రోఫీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ద్వారా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నాడు. అంతేనా.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క ప్లేయర్‌గా కూడా అవతరించబోతున్నాడు.
ఐపీఎల్ తొలి సీజన్(2008) నుంచి లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు ఎంఎస్ ధోని. ధోని ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, మధ్యలో రైజింగ్ పూణే వారియర్స్ తరఫున 2 సీజన్లు(2016, 2017) ఆడాడు. అలా ఇప్పటివరకు 249 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ కెప్టెన్.. నేటి ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి అడుగు పెట్టగానే 250వ మ్యాచ్‌ని పూర్తి చేసుకుంటాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా అవతరిస్తాడు. ఇందులో ధోని 220 మ్యాచ్‌లు చెన్నై తరఫున, 29 మ్యాచ్‌లు పుణే తరఫున ఆడాడు. ఇక ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ(243), దినేష్ కార్తిక్(242), విరాట్ కోహ్లీ(237), రవీంద్ర జడేజా(225) వరుస స్థానాల్లో ఉన్నారు.
MS Dhoni will be playing his 250th game in the Final against Gujarat
A great achievement for MSD! He’s truly a legend of the game ?#cricket #T20 #msdhoni #rohitsharma #final #Titans #achievement #Matches #BetHive pic.twitter.com/BHBpD6j6St
— BetHive (@bethiveonline) May 27, 2023
ఐపీఎల్ క్రికెట్‌లో ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడిన ధోని.. మొత్తం 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్థ సెంచరీలు, 348 ఫోర్లు, 239 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ధోని స్ట్రైక్ రేట్ 135.96 ఉండగా.. బ్యాటింగ్ యావరేజ్ 39.09 గా ఉంది. ఇవే కాక తన ఐపీఎల్ టోర్నీలో సారథిగా 13 సార్లు ప్లేఆఫ్స్.. 11 సార్లు లీగ్ ఫైనల్ ఆడాడు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని తాజాగా 12వ సారి ప్లేఆఫ్స్‌కి.. 10వ ఫైనల్ మ్యాచ్‌కి నడిపించాడు. అలాగే ధోని సారథ్యంలోనే చెన్నై జట్టు 4 సార్లు ఐపీఎల్ టోర్నీ విన్నర్‌గా.. 5 సార్లు రన్నరప్‌గా నలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..