మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీకి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురువారం చెన్నై చేరుకున్నాడు. ఆయన ఇక్కడికి చేరుకోగానే అభిమానుల జన సందోహంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. ధోనీని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ఇందులో ఓ చిన్నారి కూడా చేరింది. ఆ అమ్మాయి ధోని వద్దకు చేరుకుని, తన అభిమానితో కలసి ఓ ఫొటో దిగి మురిసిపోయింది.
మరోవైపు ఆయన ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారనే వార్త తెలియగానే అభిమానులు సందడి చేశారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జనం మధ్యలో నేరుగా కారులో కూర్చుని హోటల్‌కు చేరుకున్నారు. ధోనీ హోటల్‌కు చేరుకున్న ఫొటోను చెన్నై టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. “చివరగా తలా దర్శనం!” అంటూ ఫ్రాంచైజీ క్యాప్షన్ అందించింది. మే 2022 నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మరోసారి సందడి చేసేందుకు బరిలోకి దిగనున్నాడు.
Thala Dharisanam, finally! ?#DencomingDay pic.twitter.com/rQpinM3vrZ
— Chennai Super Kings (@ChennaiIPL) March 2, 2023
ఫ్రాంఛైజీ ఈ సీజన్‌కు సంబంధించిన శిక్షణా శిబిరాన్ని శుక్రవారం (మార్చి 3) ప్రారంభిస్తోంది. ఇదిలా ఉంటే ధోని సేనకు మరో శుభవార్త అందింది. వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ మొత్తానికి బెన్ స్టోక్స్ అందుబాటులో ఉంటాడని చెన్నై సూపర్ కింగ్స్ నమ్మకంగా ఉంది.
ధోనీతో పాటు, అంబటి రాయుడు, భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానెతో సహా పలువురు ఇతర స్టార్లు కూడా జట్టుతో చేరారు. క్యాంప్ కోసం చెన్నై చేరుకున్నారు. శుక్రవారం నుంచి కొత్త సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించనున్నారు.
????? ????? is back home !! ??
?:- @AKDFAOfficial #MSDhoni | #WhistlePodu | #IPL2023 pic.twitter.com/5iPqbCi7Al
— MSDFC Hyderabad ™ (@HYD_DhoniFans) March 2, 2023
4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత CSK మరోసారి చెన్నైలో తన క్రేజీ అభిమానుల ముందు ఆడనుంది. కరోనా కారణంగా వరుసగా మూడు సీజన్ల తర్వాత IPL తన పాత హోమ్-అవే ఫార్మాట్‌కి తిరిగి వచ్చింది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో కలిసి CSK గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. కొత్త సీజన్ మార్చి 31న CSK, గుజరాత్ మధ్య ఘర్షణతో ప్రారంభమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..