IPL 2023, LSG vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రన్ మిషిన్ విరాట్ కోహ్లీ మీదే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ప్లేయర్‌కి సాధ్యం కాని రికార్డుకు కోహ్లీ చేరువ కావడమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి, లక్నో సూపర్‌జెయింట్స్‌పై 43 పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్ క్రికెట్‌లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నతొలి ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగతున్నాడు.
King Kohli needs 43 runs to complete 7000 runs in IPL.
ఇవి కూడా చదవండిLet’s do this tonight @imVkohli
??#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #LSGvRCB pic.twitter.com/8etYu1qFIt— Royal Challengers Bangalore (@RCBxFC) May 1, 2023
కాగా, ఐపీఎల్ ఆరంగేట్ర సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున మాత్రమే ఆడుతున్న కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 231 మ్యాచ్‌లు ఆడాడు. 223 ఇన్నింగ్స్‌లో 6,957 పరుగులు చేసిన కోహ్లీ 5 సెంచరీలను, 49 హాఫ్ సెంచరీలను కూడా కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.72 గా కూడా ఉండడం మరో విశేషం. ఈ క్రమంలో ఈ రోజు కోహ్లీ తన బ్యాట్ నుంచి ఆ 43 పరుగులు రాబట్టగలిగితే ఒకే టీమ్ తరఫున 7 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ప్రత్యేక రికార్డును అందుకుంటాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..