IPL Captains-Salaries: అతనికి ధోని, కోహ్లీ, రోహిత్ కంటే ఎక్కువ జీతం.. 16వ సీజన్ కోసం ఏ టీమ్ కెప్టెన్ ఎంత తీసుకున్నాడంటే..?

|

May 29, 2023 | 10:33 AM

IPL Captains-Salaries: ఐపీఎల్ 16వ సీజన్ ఆదివారంతో ముగిసిపోవాల్సి ఉంది. కానీ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఫైనల్‌కి వరుణుడు అడ్డురావడంతో.. మ్యాచ్‌ సోమవారం రాత్రికి పోస్ట్‌పోన్ అయింది. అయితే ఆదివారం వర్షం పడిన..

IPL Captains-Salaries: అతనికి ధోని, కోహ్లీ, రోహిత్ కంటే ఎక్కువ జీతం.. 16వ సీజన్ కోసం ఏ టీమ్ కెప్టెన్ ఎంత తీసుకున్నాడంటే..?
Ipl 2023 Captains
Follow us on

IPL Captains-Salaries: ఐపీఎల్ 16వ సీజన్ ఆదివారంతో ముగిసిపోవాల్సి ఉంది. కానీ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఫైనల్‌కి వరుణుడు అడ్డురావడంతో.. మ్యాచ్‌ సోమవారం రాత్రికి పోస్ట్‌పోన్ అయింది. అయితే ఆదివారం వర్షం పడిన మాదిరిగానే.. ఈ రోజు కూడా వాన కురిస్తే ఫైనల్‌ కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేమిటంటే.. ఇరు జట్లను 5-5 ఓవర్ల ఆట ఆడించడం..లేదా సూపర్ ఓవర్ ఆట. అది కూడా జరిగేందకు అవకాశం లేకపోతే.. పాయింట్ల టేబుల్లో ఎవరు అగ్రస్థానంలో ఉంటే వారే ట్రోఫీ విజేతగా ప్రకటించబడతారు.

మరోవైపు సీజన్ ముగిసే సమయం కావడంతో ఈ ఐపీఎల్ టోర్నీ కోసం ఏ జట్టు కెప్టెన్ ఎక్కువ జీతం తీసుకున్నారని పలువురు నెటిజన్లు గూగుల్ తల్లిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఐపీఎల్ 16వ సీజన్‌లో 2 అంత కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో తన టీమ్ తరఫున కెప్టెన్‌గా వ్యవహరించిన కెప్టెన్లు.. వారి సాలరీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ముంబై ఇండియన్స్: ఐపీఎల్ క్రికెట్‌లో 2013 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ.. తాజా సీజన్‌ కోసం రూ.16 కోట్లు తీసుకున్నాడు.
  2. చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగుతున్న ఒకే ఒక్క కెప్టెన్ ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును టోర్నీ ఫైనల్‌కి నడిపించిన ధోని కూడా ఐపీఎల్ 16వ సీజన్ కోసం రూ.16 కోట్లు తీసుకున్నాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్‌సీబీ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్ కోసం 7 కోట్లు తీసుకున్నాడు. ఫాఫ్ గాయం కారణంగా ఫీల్డింగ్ చేయలేని మ్యాచ్‌లకు ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో రూ.15 కోట్లు తీసుకున్నాడు.
  5. గుజరాత్ టైటాన్స్: గతేడాదే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ సీజన్‌లోనే చాంపియన్స్‌గా అవతరించింది గుజరాత్ టైటాన్స్. అలాగే రెండో సీజన్‌లో కూడా ఈ టీమ్‌ని ఫైనల్‌కి చేర్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ టోర్నీ కోసం రూ.15 కోట్లు పుచ్చుకున్నాడు.
  6. లక్నో సూపర్ జెయింట్స్: గాయం కారణంగా టోర్నీ మధ్యలోని టీమ్‌కి దూరమైన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్ కోసం ఏకంగా రూ.17 కోట్లు తీసుకున్నాడు. అంటే ధోని, కోహ్లీ, రోహిత్ కంటే ఎక్కువ మొత్తం కేఎల్ రాహుల్ తీసుకుంటున్నాడు. ఇక రాహుల్ దూరమవడంతో కెప్టెన్‌గా టీమ్ బాధ్యతలు అందుకున్న కృనాల్ పాండ్యా ఈ సీజన్‌ కోసం రూ.8.25 కోట్లు అందుకున్నాడు.
  7. రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్ 2023 కోసం రూ.14 కోట్లు స్వీకరిస్తున్నాడు.
  8. పంజాబ్ కింగ్స్: పంజాబ్‌ని నడిపిస్తున్న శిఖర్ ధావన్‌కి ఆ టీమ్‌ రూ.8.25 కోట్లు ఇస్తోంది. అలాగే ధావన్ దూరమైనప్పుడు జట్టు బాధ్యతలు తీసుకున్న సామ్ కర్రన్ రూ. 18.50 కోట్లు అందుకున్నాడు.
  9. ఢిల్లీ క్యాపిటల్స్: ఐపీఎల్ 16వ సీజన్ కోసం ఢిల్లీ టీమ్‌ని నడిపించిన డేవిడ్ వార్నర్ ఈ టోర్నీ కోసం రూ. 6.25 కోట్లు పుచ్చుకున్నాడు.
  10. సన్‌రైజర్స్ హైదరాబాద్: తమ జట్టును నడిపిస్తున్న ఐడెన్ మార్క్రామ్‌కి ఆరెంజ్ ఆర్మీ టీమ్ రూ. 2.6 కోట్లు ఇస్తోంది.
  11. కోల్‌కతా నైట్ రైడర్స్: టోర్నీ ప్రారంభానికి ముందే శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా టీమ్‌కి దూరమవడంతో కెప్టెన్ బాధ్యతలు నితీష్ రాణా కి అందాయి. ఇక రాణా ఈ సీజన్‌లో కోల్‌కతా టీమ్ నుంచి రూ.8 కోట్లు అందుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..