- Telugu News Sports News Cricket news IPL 2023 know these 5 cricket records that are almost impossible to break from Virat Kohli, Chris gayle to Gautam Gambhir
IPL: ఐపీఎల్ హిస్టరీలో 5 భారీ రికార్డులు.. బ్రేక్ చేయడం మాత్రం చాలా కష్టం గురూ.. లిస్టులో 4గురు భారత్ నుంచే..
IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 15 సీజన్‌లు జరిగాయి. ఈ సీజన్లలో అనేక రికార్డులు సృష్టించబడ్డాయి. ఈ రికార్డులను బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం.
Updated on: Mar 10, 2023 | 1:07 PM

IPL 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ లీగ్‌కి ఇది 16వ సీజన్. గత 15 ఏళ్లలో ఈ లీగ్‌లో కొన్ని రికార్డులు సృష్టించబడ్డాయి. ఇవి బద్దలు కొట్టడం అసాధ్యం.

2016 సంవత్సరంలోనే విరాట్ కోహ్లీ ఓ అసాధ్యమైన రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లి తన భాగస్వామి, అత్యంత సన్నిహితుడు, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌తో కలిసి పరుగుల పరంగా అతిపెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ 14 మే 2016న తమ సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. కోహ్లీ 109 పరుగులు, డివిలియర్స్ 129 పరుగులు చేశారు.

యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ ఐపీఎల్‌లో చాలా రికార్డులు సృష్టించాడు. అయితే, 2013 సంవత్సరంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనిని పునరావృతం చేయడం అసాధ్యం. 2013లో RCB తరపున ఆడుతున్నప్పుడు గేల్ పూణె వారియర్స్‌పై అజేయంగా 175 పరుగులు బాదేశాడు. గేల్ 66 బంతుల్లో 17 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఈ రికార్డుకు చేరువ కాలేదు.

ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2016 సంవత్సరంలో అతను RCB తరపున 16 మ్యాచ్‌లు ఆడుతూ మొత్తం 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒక్క సీజన్‌లో ఏ ఆటగాడు కూడా 900 పరుగులు దాటలేకపోయాడు. ఈ సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు.

గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. అదే సంవత్సరంలో ఛాంపియన్‌గానూ నిలిచింది.

ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో 37 పరుగులు చేసిన ఇద్దరు ఆటగాళ్లు క్రిస్ గేల్, రవీంద్ర జడేజా మాత్రమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నప్పుడు గేల్ కొచ్చి టస్కర్స్‌పై ఒక ఓవర్‌లో 37 పరుగులు చేశాడు. ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఓవర్లో గేల్ నోబాల్ సహా 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ 2021లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో జడేజా 37 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్‌లో ఒక బంతి నో బాల్.




