ఇకపై ప్లేయింగ్ 11కాదు.. ప్లేయింగ్ 15.. ఐపీఎల్‌లో తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్.. ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తారంటే?

|

Dec 13, 2022 | 8:14 AM

IPL 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలుచేయనున్నారు. అసలు ఈ రూల్ ఏంటి, అన్ని జట్లు ఎలా, ఎప్పుడు ఉపయోగిస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇకపై ప్లేయింగ్ 11కాదు.. ప్లేయింగ్ 15.. ఐపీఎల్‌లో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తారంటే?
Ipl 2023 Impact Player Rules
Follow us on

Impact Player Rules: ఐపీఎల్ 2023కి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు డిసెంబరు 23న కొచ్చిలో మినీ వేలం నిర్వహిస్తారు. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు తమ స్క్వాడ్‌లను పూర్తి చేసుకుంటాయి. ఈ ఐపీఎల్‌లో కొంతమంది కీలక ఆటగాళ్లు పునరాగమనం చేయడం వల్ల లీగ్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అలాగే కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం టోర్నమెంట్‌లో ప్రకంపనలు రేపుతుంది. అంటే ఆ రూల్స్‌పై ఆసక్తి మరింత పెరగబోతోంది. ఆ నియమమే ఇంపాక్ట్ ప్లేయర్. ఐపీఎల్‌లో ఈ నిబంధనను అమలు చేయడం వల్ల టాస్ సమయంలో, కెప్టెన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్ల పేర్లను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఆటగాళ్లు ఎవరు? అవి ఎలా ఉపయోగిస్తారో తెలుసుకునే ముందు, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం?

ఈ నియమం ప్రకారం, టాస్ సమయంలో, మ్యాచ్ ఆడే రెండు జట్ల కెప్టెన్లు ప్లేయింగ్ XIతో పాటు వారి నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పేర్కొనాలి. వీరినుంచి ఈ రెండు జట్లు ఒక ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఇది ఎలా ఉపయోగిస్తారు?

14వ ఓవర్‌కు ముందు, ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏ ఆటగాడినైనా భర్తీ చేయగలడు. కెప్టెన్, ప్రధాన కోచ్ లేదా మేనేజర్ మార్పు గురించి అంపైర్‌కు తెలియజేయడం ముఖ్యం. ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఉపయోగించినప్పుడు, అతను తన కోటాలో మొత్తం ఓవర్లలో బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్ చేయగలడు. ఒక ఆటగాడు రిటైర్డ్ హర్ట్ అయినట్లయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌ని కొనసాగుతున్న ఓవర్ చివరిలో మాత్రమే ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి సమయంలో ఈ రూల్స్ వర్తించవు?

వర్షం కారణంగా ఓవర్లు తగ్గి, మ్యాచ్ 10-10 ఓవర్లుగా మారితే, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించలేరు. అదే సమయంలో, గాయం విషయంలో, ప్రత్యామ్నాయ ఆటగాడు మిగిలిన గేమ్‌లో పాల్గొనడానికి అనుమతించబడడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ ఓవర్ మధ్యలో గాయపడితే, అంపైర్ ఆమోదం పొందిన తర్వాత, ప్రస్తుత సాధారణ ఫీల్డర్ ప్రత్యామ్నాయ నియమం వర్తిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రత్యామ్నాయం బౌలింగ్, కెప్టెన్‌గా చేయలేరు.

మొదట ఎక్కడ ఉపయోగించారు?

ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఉపయోగించిన తొలి జట్టు ఢిల్లీ. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మణిపూర్‌పై ఈరూల్‌ని ఉపయోగించారు. హృతిక్ షోకీన్ మొదటి ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు. ఓపెనర్ హితేన్ దలాల్ స్థానంలో అతను వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..