IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో ఎంతో పటిష్టంగా ఉన్న గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠబరిత విజయం సాధించి, 5వ సారీ టోర్నీ విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చూపిన అత్యుత్సాహంపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పాటు దక్షిణ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జై షాపై దుమ్మెత్తిపోస్తున్నారు. చెన్నై బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో జై షా చేసిన అసభ్యకర సంజ్ఞకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఫైనల్ మ్యాచ్‌లో జై షా తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్‌కు మద్దతు తెలిపారు. గుజరాతీగా.. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఉన్న సత్సంబంధాల కారణంగా జై షా టైటాన్స్ టీమ్‌కి సప్పోర్ట్ ఇవ్వడంలో తప్పులేదు. అయితే బీసీసీఐ సెక్రటరీగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడిగా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన జై షా.. ఇలా ప్రవర్తించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
అసలేం జరిగిందంటే.. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం. ఈ క్రమంలో మోహిత్ శర్మ అద్భుతమైన యార్కర్లతో తొలి 2 బంతులతో చెన్నై జట్టును కట్టడి చేశాడు. దాంతో చివరి 4 బంతుల్లో చెన్నై విజయానికి 12 పరుగులు అవసరమైన నేపథ్యంలో.. క్రీజులో ఉన్న చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే, రవీంద్ర జడేజా బిగ్ షాట్స్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో చెన్నై ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. చెన్నై అభిమానులు కూడా తమకు ఓటమి తప్పదనే బాధను దిగమింగుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌తో సహా శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు.. విజయం తమదేనని సెలెబ్రేట్ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే డగౌట్‌లో ఉన్న జై షా.. తన చేతితో అసభ్యకరమైనరీతిలో తన చేతులు ఊపాడు. మంచిగా అయ్యిందన్నట్లుగా చేయిని ఊపుతూ సంతోషం వ్యక్తం చేశాడు.
Shameful gesture by Jay Shah. pic.twitter.com/OkDrZ7v33J
— Trinamool Congress (Abar TMC) (@abarTMC) May 30, 2023
#JayShah ko zyada hi jaldi thi. 4 ball pehle hi khud k ‘haarne’ ka ishara kar raha tha.?♂️
What a disgust.?? He is a meme for himself.
Shame on Indian cricketing fraternity. ????? @IPL @ChennaiIPL @BCCI @gujarat_titans @BJP4Gujarat @BJP4India #csk #MSDhoni? #IPL2023Final pic.twitter.com/LkLdxIiDzf— Navneet Rai (@rainartistics) May 30, 2023
అయితే జై షా అలా చేతులు ఊపిన తీరును బూతుల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జై షా ఉద్దేశం కూడా అదే అయి ఉండవచ్చు. ఇక ఇదంతా టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణాది జట్లన్నా.. ప్రజలన్నా జై షాకు ఎంతటి వివక్షో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఇలాంటివారికి బీసీసీఐ సెక్రటరీ వంటి అత్యున్నత పదవి ఇవ్వడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జైషా సంతోషానికి విపరీతంగా.. చెన్నై గెలవడంతో అందరం సంతోషిస్తున్నామని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా చివరి 2 బంతులను గుజరాతీ ప్లేయర్, చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 6, 4 బాది చెన్నైకి ఎన్నటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.