
Deepak Chahar CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేసి, ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ ఆడనుంది. ఫైనల్ పోరుకు చెన్నై సర్వం సిద్ధం చేసింది. దాదాపు ప్రతి పెద్ద మ్యాచ్‌లో ప్రమాదకరంగా బౌలింగ్ చేసే బౌలర్‌కు మరింత పదును పెడుతోంది. ఫైనల్లోనూ మరోసారి ఆ బాణాన్ని విసిరి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ధోని కోరుకుంటున్నాడు. ఆ బౌలర్ ఎవరో కాదు.. దీపక్ చాహర్ గురించే మాట్లాడుతున్నాం.
చెన్నై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఎన్నో సందర్భాలలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్లేఆఫ్స్‌లో దీపర్ చాహర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన చాహర్ 12 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సీజన్ తొలి క్వాలిఫయర్‌లో చాహర్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు, 2021 చివరి మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
2019 ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లోనూ దీపక్ ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. తొలి క్వాలిఫయర్‌లో ఒక వికెట్, రెండో క్వాలిఫయర్‌లో 2 వికెట్లు తీశాడు. అంతకుముందు, అతను 2018 ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2023 చివరి మ్యాచ్‌లో చాహర్ ప్రత్యర్థి జట్టుకు ముప్పుగా మారగలడు. మరో విషయం ఏమిటంటే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చాహర్‌పై చాలా నమ్మకం. ఒక ఆటగాడికి కెప్టెన్ విశ్వాసం ఉంటే, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కాబట్టి ఫైనల్లో చాహర్ రాణించేందుకు అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ గుజరాత్, ముంబై మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.
క్వాలిఫైయర్-1 2018 : 4-0-31-1(ఓవర్లు-మెయిడీన్లు-పరుగులు-వికెట్లు)
ఫైనల్ 2018 : 4-0-25-0
క్వాలిఫైయర్-1 2019 : 3.3-0-30-1
క్వాలిఫైయర్-2 2019 : 4-0-28-2
ఫైనల్ 2019 : 4-1-26-3
ఫైనల్ 2021 : 4-0-32-1
క్వాలిఫైయర్-1 2023 : 4-0-29-2
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..