LSG vs MI: కోహ్లీ ఎనిమీని వదలని ‘స్వీట్ మ్యాంగో’.. వెరైటీగా ఇచ్చి పడేసిన ముంబై ఆటగాళ్లు.. ఫొటో వైరల్..

|

May 25, 2023 | 5:20 PM

Naveen Ul Haq: లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. ప్రత్యర్థి జట్టు ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను టార్గెట్ చేసింది. ముంబై ఆటగాళ్లు స్వీట్ మ్యాంగోతో ఆసక్తికరమైన ఫొటోను పంచుకున్నారు.

LSG vs MI: కోహ్లీ ఎనిమీని వదలని స్వీట్ మ్యాంగో.. వెరైటీగా ఇచ్చి పడేసిన ముంబై ఆటగాళ్లు.. ఫొటో వైరల్..
Naveen Ul Haq Vs Mumbai
Follow us on

IPL 2023, LSG vs MI: ఐపీఎల్ 2023లో ఫైనల్‌తో సహా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. ఆపై ఫైనల్ మే 28, ఆదివారం జరుగుతుంది. అంతకుముందు లక్నో, ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ముంబై ఇండియన్స్‌కు చెందిన కొంతమంది ఆటగాళ్లు స్వీట్ మ్యాంగో ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి లక్నో ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు.

నవీన్-ఉల్-హక్‌ను టార్గెట్ చేసిన ముంబై..

మే 9న, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో, నవీన్-ఉల్-హక్ ఒక ప్లేట్‌లో కొన్ని మామిడి పండ్లతో ఓ స్టోరీని పంచుకున్నాడు. “స్వీట్ మ్యాంగో” అంటూ రాసుకొచ్చాడు. ఆ తర్వాత నవీన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు. అయితే, దీని తర్వాత RCB టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగానే.. నవీన్ మరో స్టోరీ షేర్‌ చేసి కోహ్లీ జట్టును పరోక్షంగా టార్గెట్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నవీన్-ఉల్-హక్‌ను లక్ష్యంగా చేసుకుంది. ముంబై ఆటగాళ్ళు విష్ణు వినోద్, కుమార్ కార్తికేయ, సందీప్ వారియర్ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ముగ్గురు ఆటగాళ్లు కొన్ని మామిడికాయలతో టేబుల్ చుట్టూ కూర్చున్నారు.

ముగ్గురు ముంబై ఆటగాళ్లు ఈ ఫొటోలో వేర్వేరు పోజులు ఇచ్చారు. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, “ది స్వీట్ మ్యాంగోస్” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే, ఈ పోస్ట్ కొంత సమయం తర్వాత తొలగించారు. అయితే అంతకుముందే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎలిమినేటర్‌లో మరోసారి ఓడిన లక్నో..

ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ రెండోసారి ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ రెండవ ఐపీఎల్ సీజన్ ఆడుతోంది. గత సంవత్సరం (IPL 2022) కూడా ఎలిమినేటర్‌కు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి ముంబై చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..