SRH vs DC: మామ మారిపోలేదుగా..! భువనేశ్వర్‌ కాళ్లపై పడిన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో..

|

Apr 25, 2023 | 8:32 AM

IPL 2023: హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ సారథి అయిన డేవిడ్ వార్నర్ తన మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇలా విజయం అందుకున్నాడు. అయితే మ్యాచ్‌కి ముందు వార్నర్ చేసిన..

SRH vs DC: మామ మారిపోలేదుగా..! భువనేశ్వర్‌ కాళ్లపై పడిన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో..
Warner Touching Bhubaneswar's Feet
Follow us on

IPL 2023: హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ సారథి అయిన డేవిడ్ వార్నర్ తన మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇలా విజయం అందుకున్నాడు. అయితే మ్యాచ్‌కి ముందు వార్నర్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తన మాజీ టీమ్‌మేట్స్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి కనబర్చాడు వార్నర్ మామ. హైదరాబాద్-ఢిల్లీ మ్యాచ్ కోసం ఉప్పల్‌ వచ్చిన వార్నర్.. టాస్ కోసమని  మైదానంలోకి వచ్చాడు. అయితే పదేళ్లుగా హైదరాబాద్ టీమ్‌కి బౌలింగ్ సేవలు అందిస్తున్న భువనేశ్వర్ కుమార్ కనిపించాడు. అంతే..   హైదరాబాద్‌కు  పాటు బౌలింగ్ బాధ్యతలు మోస్తున్న భువనేశ్వర్ కనిపించాడు. అంతే.. వార్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి.. భువనేశ్వర్ కాళ్ల మీద పడ్డాడు. ఈ సమయంలో భువీ వద్దని వారించినా వార్నర్ వినలేదు. ఆ తర్వాత మనసారా ఒకరినొకరు హత్తుకున్నారు.

నిజానికి తన మాజీ కెప్టెన్ చేసిన పనికి భువీ ఖంగుతిన్నాడు. విశేషమేమంటే.. మ్యాచ్ కోసం అప్పుడప్పుడే వచ్చి సీట్లలో కూర్చొంటున్న వేలాది అభిమానుల మధ్య ఈ సన్నివేశం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను ‘ఐపీఎల్’ తన ఖాతా ద్వారా షేర్ చేసింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, సన్‌రైజర్స్ అభిమానులు తమ వార్నర్ మామ మారిపోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సన్‌రైజర్స్ తరఫున ఎంత మంది క్రికెటర్లు ఆడినప్పటికీ అభిమానులకు వార్నర్‌తోనే ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. పేరుకే పరాయి దేశంవాడు కానీ అతని గుండెల్లో భారత్‌కి, అలాగే ఇక్కడి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇవి కూడా చదవండి


కాగా వార్నర్, భువనేశ్వర్ ఇద్దరు కలిసి 2014 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్ టీమ్ తరఫున ఆడారు. వార్నర్ నాయకత్వంలో భువీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీమ్‌కి అత్యుత్తమ సేవలు అందించారు. ఎంతగా అంటే.. ఇప్పటికీ టీమ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసింది వీరిద్దరే. ఈ క్రమంలోనే 2016, 2017, 2019 ఐపీఎల్ సీజన్లలో వార్నర్ ఆరెంజ్ క్యాప్‌లు తన సొంతం చేసుకోగా.. 2016, 2017 సీజన్లలో భువీ పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు.  ఇంకా వార్నర్ సారధ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2016లో విజేతగా నిలిచింది. అయితే 2021 ఐపీఎల్ తర్వాత వార్నర్‌ని ఆరెంజ్ ఆర్మీ విడుదల చేసింది. అనంతరం జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తమ శిబిరంలోకి స్వాగతం పలికింది. అయినప్పటికీ వార్నర్‌తో ఉన్న అనుబంధాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కానీ, వారితో ఉన్న సత్సంబంధాలను వార్నర్ కానీ వదులుకోలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..