CSK vs LSG, IPL 2023: ఊరిస్తోన్న సరికొత్త చరిత్ర.. ధోనీ ఖాతాలో చేరనున్న స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఎవరున్నారంటే?

|

Apr 03, 2023 | 3:17 PM

MS Dhoni IPL Record: ఐపీఎల్ 2023 ఆరో మ్యాచ్‌లో ఈరోజు చెన్నై, లక్నో జట్లు తలపడనున్నాయి. ఎంఎస్ ధోనీకి ఈ మ్యాచ్ ప్రత్యేకం కానుంది. ఈ మ్యాచ్‌లో అతను వ్యక్తిగత రికార్డును సాధించే ఛాన్స్ ఉంది.

CSK vs LSG, IPL 2023: ఊరిస్తోన్న సరికొత్త చరిత్ర.. ధోనీ ఖాతాలో చేరనున్న స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఎవరున్నారంటే?
Ms Dhoni
Follow us on

MS Dhoni IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆరో మ్యాచ్ ఈరోజు (ఏప్రిల్ 3) జరగనుంది. ఈ మ్యాచ్ చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. లక్నోతో జరిగే ఈ మ్యాచ్ ఎంఎస్ ధోనీకి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో అతను వ్యక్తిగత విజయాన్ని సాధించే అవకాశం ఉంది. లక్నోతో జరిగే మ్యాచ్‌లో ధోనీ 8 పరుగులు చేస్తే ఐపీఎల్ బ్యాట్స్‌మెన్‌ల ప్రత్యేక క్లబ్‌లో చేరతాడు. ఇందుకోసం ధోనికి 8 పరుగులు కావాలి. గుజరాత్‌తో జరిగిన ఓపెనర్ మ్యాచ్‌లో ధోని మంచి టచ్‌లో కనిపించాడు. ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 7 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను ఒక ఫోర్, సిక్సర్ కూడా బాదాడు.

8 పరుగుల దూరంలో ధోనీ..

ఎంఎస్ ధోని 235 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 207 ఇన్నింగ్స్‌ల్లో 4992 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5000 పరుగులు పూర్తి చేయడానికి అతను 8 పరుగులు చేయాల్సి ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 8 పరుగులు చేస్తే, ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన సీఎస్‌కే నుంచి రెండవ ఆటగాడిగా మారనున్నాడు. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ కంటే ముందు, విరాట్ కోహ్లీ 6706, శిఖర్ ధావన్ 6284, డేవిడ్ వార్నర్ 5937, రోహిత్ శర్మ 5880, సురేశ్ రైనా 5228, ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు చేశారు.

రెండవ అత్యంత విజయవంతమైన కెప్టెన్..

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. తన కెప్టెన్సీలో నాలుగుసార్లు CSKని ఛాంపియన్‌గా నిలిపాడు. 2016, 2017 సీజన్‌లను పక్కన పెడితే, ధోనీ 2008 నుంచి CSK తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 హాఫ్ సీజన్ పక్కన పెడితే, ధోనీ కెప్టెన్‌గా పనిచేశాడు. గత సీజన్‌లో సీఎస్‌కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసింది. కానీ, హాఫ్ సీజన్‌లో కెప్టెన్సీ చేసిన తర్వాత జడేజా రాజీనామా చేశాడు. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈసారి గత సీజన్‌లో ప్రదర్శనను మరిచిపోయి జట్టుకు మరో ట్రోఫీని అందించాలని ధోనీ భావిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..