IPL 2023 : హైదరాబాద్ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..

ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్.. 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బరిలోకి దిగిన సూపర్ కింగ్స్..

IPL 2023 : హైదరాబాద్ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..
Csk Vs Srh

Updated on: Apr 22, 2023 | 5:25 AM

ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్.. 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. 18.4 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేశారు. 3 వికెట్లు కోల్పోయి 135 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై బ్యాట్స్‌మెన్.. మ్యాచ్ ఆరంభం నుంచి అదరగొట్టారు. ఓపెనర్‌ డేవన్ కాన్వే 77 పరుగులతో రఫ్ఫాడించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 37 పరుగులు చేసి టీమ్‌కు శుభారంభం అందించారు. అజింక్య రహానే 9 పరుగులు చేశాడు.

ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన సన్ రైజర్స్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్‌లో అభిషేక్ శర్మ 34 పరుగులతో ఒక్కడే రాణించాడు. ఆ తరువాత హ్యారీ బ్రూక్ 18, త్రిపాఠి 21, క్లాసెస్ 17, జాన్ సెన్ 17 పరుగులతో జట్టు స్కోర్ పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. చెన్నై బౌలర్ల ధాటికి ఎస్ఆర్‌హెచ్ మిడిలార్డర్ అట్టర్ ప్లాప్ అవడంతో జట్టు స్కోర్ చాలా తక్కువగా నమోదైంది. దాంతో తమ ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై బ్యాట్స్‌మెన్ దుమ్మురేపారు. నిర్ణీత ఓవర్లకు 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ముద్దాడారు. ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో మయాంక్​ మార్కండే 2 వికెట్లు పడగొట్టాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ఆకాశ్​సింగ్, తీక్షణ, మతీశ పతిరణ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

అట్టడుగున సన్ రైజర్స్ హైదరాబాద్..

సన్​రైజర్స్​ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్​కింగ్స్​జట్టు.. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..