IPL 2023 Award Winners List: ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్‌ను శుభమాన్ గిల్ సొంతం చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేశాడు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. మహ్మద్ షమీ 17 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 28 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌లో మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ తలో 27 వికెట్లు తీశారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌లో పీయూష్ చావ్లా 22 వికెట్లు పడగొట్టాడు.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు కూడా భారీ మొత్తాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా రూ. 13 కోట్లు సాధించింది.
ఆరెంజ్ క్యాప్ విజేత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభమన్ గిల్ రూ.15 లక్షలు అందుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన పర్పుల్ క్యాప్ విజేత మహ్మద్ షమీకి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు లభించాయి.
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సంయుక్తంగా అత్యధిక సార్లు IPL గెలిచిన జట్టుగా నిలిచాయి. ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలో 5 సార్లు కైవసం చేసుకున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..