IPL 2023 Auction: 155 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు.. 3సార్లు హ్యాట్రిక్.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని భారత మాజీ బౌలర్ దూకుడు..

|

Dec 23, 2022 | 8:07 PM

Lucknow Super Giants Player Amit Mishra: అమిత్ మిశ్రాను లక్నో సూపర్ జెయింట్స్ అతని బేస్ ధరకు కొనుగోలు చేసింది.

IPL 2023 Auction: 155 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు.. 3సార్లు హ్యాట్రిక్.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని భారత మాజీ బౌలర్ దూకుడు..
Ipl 2023 Auction Lucknow Super Giants Player Amit Mishra
Follow us on

ఐపీఎల్ 2023 వేలంలో ప్రవేశించిన అతి పెద్ద వయసు ఆటగాడు అమిత్ మిశ్రా. 40 ఏళ్ల లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత ఏడాది జరిగిన మెగా వేలంలో అమ్ముడుకాలేదు. ఈసారి తన బేస్ ధర రూ.50 లక్షలుగా ఉంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ అదే ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా మాట్లాడుతూ, తనలో ఇంకా 2-3 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడే సత్తా ఉందని చెప్పుకొచ్చాడు.

అమిత్ మిశ్రా ఐపీఎల్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. అతను మొత్తం 154 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉన్నాడు. అందులో అతను 166 వికెట్లు తీసుకున్నాడు. అతను యుజ్వేంద్ర చాహల్‌తో పాటు బీసీసీఐ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 3 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా పేరుగాంచాడు. ఇలాంటి రికార్డులతో కూడా మెగా వేలంలో మిశ్రాను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో మాత్రం, మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్ 2023 వేలానికి ముందు 10 వికెట్లు..

IPL 2023 వేలంలో పేరు నమోదు చేసేకంటే ముందు, అమిత్ మిశ్రా దేశీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. అక్కడ అతను 5.89 ఎకానమీతో 8 మ్యాచ్‌లలో తన జట్టు హర్యానా తరపున 10 వికెట్లు పడగొట్టాడు. ఆ 8 మ్యాచ్‌ల్లో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం అమిత్ మిశ్రా అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

అమిత్ మిశ్రా ఐపీఎల్ ప్రదర్శన..

2013 సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇక 19 పరుగులకు 4 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా 2011లో తన 19 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.

అమిత్ మిశ్రా IPL కెరీర్ గ్రాఫ్ 2020 సీజన్ నుంచి పడిపోవడం ప్రారంభమైంది. అతను కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021లో కూడా కేవలం 4 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఓ మ్యాచ్‌లో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..