Watch Video: ఐపీఎల్ 2022లో తొలి వివాదం.. కేన్ మామ ఔట్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయంటే?

|

Mar 30, 2022 | 7:13 PM

Kane Williamsons Controversial Dismissal: ఐపీఎల్ 2022 ప్రారంభమైన మూడో రోజున మొదటి వివాదం తెరపైకి వచ్చింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌కి సంబంధించి పెద్ద వివాదమే నడుస్తోంది.

Watch Video: ఐపీఎల్ 2022లో తొలి వివాదం.. కేన్ మామ ఔట్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయంటే?
Ipl 2022 Kane Williamsons Controversial Dismissal
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022) ప్రారంభమైన మూడో రోజున మొదటి వివాదం తెరపైకి వచ్చింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRh vs RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌కి సంబంధించి పెద్ద వివాదమే నడుస్తోంది. హైదరాబాద్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. ఓవర్‌లోని నాల్గవ బంతి నేరుగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. విలియమ్సన్(Kane Williamsons ) బ్యాట్ అంచుని తాకింది. సంజు స్క్రాప్ చేసిన బంతిని ఫస్ట్ స్లిప్ వద్ద నిలబడిన దేవదత్ పడికల్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ సరిగ్గా పట్టాడా.. లేదా.. బంతి గ్రౌండ్‌ని తాకిందా.. అనేది గ్రౌండ్ అంపైర్‌కు అర్థం కాలేదు. అంపైర్ విలియమ్సన్ ఔట్ కావడానికి సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ధృవీకరణ కోసం చెక్ చేయమని థర్డ్ అంపైర్‌ని కోరాడు. థర్డ్ అంపైర్ కూడా ప్రతి కోణంలో రీప్లేలు చూసి విలియమ్సన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దాంతోనే అసలు వివాదం మొదలైంది.

మొదటి ఫ్రేమ్‌లో బంతి నేలపై పడిందని, విలియమ్సన్ నాటౌట్‌గా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. విలియమ్సన్ బ్యాట్ తాకిన బంతి నేలను తాకినట్లు వీడియోలోని మొదటి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపించింది. దీని తర్వాత ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడంతో అవుట్ లేదా నాటౌట్ అనే చర్చ జరిగింది. హైదరాబాద్‌కు విలియమ్సన్ వికెట్ చాలా కీలకం. ఎలాంటి మ్యాచ్‌నైనా తన బ్యాటింగ్‌తో మలుపు తిప్పగలడు. ఒకవేళ అతడు నాటౌట్‌గా ప్రకటించి ఉంటే మ్యాచ్‌ మారే అవకాశం ఉండేది. కేన్ మామ ఔటైన తర్వాత రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అభిషేక్ వర్మ కూడా తొందరగానే ఔటయ్యారు.

ఫీల్డర్ తక్కువ ఎత్తులో క్యాచ్ (భూమికి దగ్గరగా క్యాచ్) తీసుకుంటే క్లీన్ క్యాచ్ నియమం పాలించాల్సి ఉంటుంది. అంటే ఆ సమయంలో క్యాచ్ పట్టిన ఫీల్డర్ వేళ్లు బంతి కింద ఉండాలి. ఏదైనా సందర్భంలో ఫీల్డర్‌కు బంతి కింద రెండు వేళ్లు ఉండి, బంతి నేలపైనే ఉంటే, క్యాచ్ క్లీన్‌గా పరిగణిస్తారు. అప్పుడు బ్యాట్స్‌మన్ ఔట్ అవుతాడు. విలియమ్సన్ విషయానికొస్తే, బంతి నేలను తాకినట్లు అనిపించింది. అయితే ఫీల్డర్ వేలు బంతి కింద ఉందో లేదో స్పష్టంగా తెలియలేదు. గ్రౌండ్ అంపైర్ అవుట్ చేయడంతో థర్డ్ అంపైర్ ఈ నిర్ణయాన్ని సమర్థించాల్సి వచ్చింది.

Also Read: IPL Rights: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం తీవ్రమైన పోటీ.. రూ. 45 వేల కోట్లపై కన్నేసిన బీసీసీఐ.. లిస్టులో బడా కంపెనీలు..

IPL 2022: ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పేరిట చెత్త రికార్డ్.. లిస్టులో ఏ టీంలు ఉన్నాయంటే?