బెంగళూర్ జట్టు సోషల్ మీడియాలో తమ ఖాతాలో వారి లోగో రంగును మార్చింది. ఎరుపు రంగును నీలంగా మార్చి షాకిచ్చింది. అయితే, ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే MIకి మద్దతు ఇవ్వడానికేనని తెలుస్తోంది. నిజానికి ముంబై విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. IPL-15 పాయింట్ల పట్టికలో MI విజయంపై RCB ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. మంబై జట్టు డీసీని ఓడించినట్లయితే, RCB నేరుగా ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తుంది. కానీ, ఈ మ్యాచ్‌లో డీసీ విజయం సాధించగలిగితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా, ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది. RCB ఈ లోగో కింద #REDTURNSBLUE అని కూడా రాసింది. బ్లూ జెర్సీలో MI ఆడటానికి మా మద్దతును తెలియజేయడం దీని ఉద్దేశ్యంగా పేర్కొంది.
#NewProfilePic pic.twitter.com/IqRXDRDQ0E
ఇవి కూడా చదవండి— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022
DC, MI మధ్య మ్యాచ్‌కు ముందు దినేష్ కార్తీక్ కూడా ఒక ఫన్నీ ట్వీట్..
RCB వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా MI జెర్సీలో ఉన్న తన పాత ఫోటోను ట్వీట్ చేశాడు. తన జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్‌కు చేరుకునేలా ఈరోజు ముంబై గెలవాలని కార్తీక్ కూడా ప్రార్థిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. దినేష్ కార్తీక్ 2012, 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
Found this in archives ??#MIvDC pic.twitter.com/laTOcFAeDM
— DK (@DineshKarthik) May 21, 2022
పాయింట్ల పట్టికలో బెంగళూర్ స్థానం..
IPL-15 ప్లే-ఆఫ్‌లలో ఇంకా ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. గుజరాత్, లక్నో, రాజస్థాన్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. నాలుగో స్థానాన్ని ఢిల్లీ-ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నిర్ణయించనున్నారు. RCB ప్రస్తుతం 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. అదే సమయంలో, ఢిల్లీ 14 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. దాని నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది.
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబయి.. నేడు ఢిల్లీపై గెలిస్తే బెంగళూరు సులువుగా తదుపరి రౌండ్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే 16 పాయింట్లు, నెట్ రన్ రేట్ బాగా ఉండటంతో నాలుగో స్థానం దక్కించుకోనుంది. బెంగళూరు మద్దతుదారులు ఈ రోజు తమ హృదయపూర్వకంగా ముంబైకి మద్దతు ఇవ్వడానికి ఇదే కారణం. ఈ విషయం కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తరచుగా RCB, ముంబై అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు పోట్లాడుకోవడం, ట్రోల్ చేసుకోవడం కనిపిస్తుంది.
झुकती है दुनिया झुकाने वाला चाहिए ??#MumbaiIndians bolte ? https://t.co/K7wqIU78XV
— Adi ?? (@_not_adi_) May 21, 2022
No self-respect? https://t.co/x6EK3xJbwZ
— Vishal (@vishxl7) May 21, 2022
Also Read: MI vs DC, IPL 2022: రోహిత్ భయ్యా.. కోహ్లీ కోసం ఈ ఒక్కసారి ప్లీజ్ అంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?