IPL 2022: ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అట్టర్ ప్లాప్‌.. గందరగోళంలో టీమ్‌ ఇండియా పరిస్థితి..!

|

May 18, 2022 | 2:48 PM

IPL 2022: బౌలర్లు ఎవరి పేరు చెబితే వణికిపోతారో, ఎవరి కెప్టెన్సీ వ్యూహం ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంటుందో ఆ వ్యక్తి ఇప్పుడు ఫామ్‌లో లేడు. అతడు ఎవరో కాదు

IPL 2022: ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అట్టర్ ప్లాప్‌.. గందరగోళంలో టీమ్‌ ఇండియా పరిస్థితి..!
Rohit Sharma
Follow us on

IPL 2022: బౌలర్లు ఎవరి పేరు చెబితే వణికిపోతారో, ఎవరి కెప్టెన్సీ వ్యూహం ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంటుందో ఆ వ్యక్తి ఇప్పుడు ఫామ్‌లో లేడు. అతడు ఎవరో కాదు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఐపీఎల్‌ 2022లో రోహిత్‌ శర్మ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడు. అతడి కెప్టెన్సీ కూడా విఫలమైంది. రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. వాస్తవానికి రోహిత్ కెప్టెన్సీలో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు మాత్రం అట్టడుగున పడిపోయింది. ఎనిమిది వరుస పరాజయాలను చవిచూసింది ఫలితంగా ముంబై ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. దారుణమైన విషయం ఏంటంటే ఈ సీజన్‌లో జట్టు 10వ స్థానంలో కొనసాగుతోంది.

ముంబై 13 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు 10 ఓటములతో ఆరు పాయింట్లతో ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది. ఇంకా ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పాయింట్ల పట్టికలో ముంబై ఈ స్థానంలో ఉంటుందని టైటిల్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కెప్టెన్‌గా రోహిత్ జట్టును ప్లే ఆఫ్స్‌లో చేర్చలేకపోయాడు. 2013లో తొలిసారిగా ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ తొలి సీజన్‌లోనే జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. కానీ ఈ సీజన్‌లో ఫలితం వేరేలా ఉంది. రోహిత్ వ్యూహాలు ఫలించలేదు. మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలు ప్రభావవంతంగా లేవు. ఈ సీజన్‌లో కీరన్ పొలార్డ్ ఫామ్‌లో లేడు. కానీ రోహిత్ అతనికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ వంటి ఆటగాడిని దూరంగా పెట్టాడు.

అదే సమయంలో రోహిత్ తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ సీజన్‌లో అతనికి ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను చేసిన 48 పరుగులు ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు. మరికొన్ని మ్యాచ్‌ల్లో 40 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో రోహిత్ బ్యాటింగ్‌లో 266 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ సమయంలో అతని సగటు 20.46గా ఉంది. రోహిత్ కెప్టెన్సీలోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఫ్లాప్ కావడం టీమ్ ఇండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే రోహిత్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి కెప్టెన్సీ సఫలం కాకపోతే టీమ్ ఇండియా నష్టపోవాల్సి రావచ్చు. రాబోయే కాలంలో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లు ఆడాల్సి ఉండగా అందులో రోహిత్‌ ఆడటం చాలా ముఖ్యం. కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్స్‌మెన్ పరంగా కూడా రోహిత్ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. రోహిత్ జట్టు బ్యాటింగ్‌కు కీలకం. ఈ సమయంలో చూస్తే విరాట్ కోహ్లి కూడా ఫామ్‌లో లేడు. ఈ పరిస్థితుల్లో రోహిత్‌ పరుగులు చేయాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది. అలాగే ఇద్దరు టాప్ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేకపోవడాన్ని భారత్ భరించలేకపోతోంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి