IPL 2022: లక్నో కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ ఫిక్స్.. రిటెన్షన్‌లో మరో ఇద్దరు కూడా..!

KL Rahul: కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే 2022లో మాత్రం పంజాబ్ తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.

IPL 2022:  లక్నో కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ ఫిక్స్.. రిటెన్షన్‌లో మరో ఇద్దరు కూడా..!
Kl Rahul
Follow us

|

Updated on: Jan 18, 2022 | 6:58 PM

Lucknow Team: ఐపీఎల్ 2022 (IPL 2022) లో అరంగేట్రం చేసిన లక్నో ఫ్రాంచైజీ తన ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ ఫ్రాంచైజీ భారత జట్టు ఓపెనర్‌ను ఎంపిక చేసుకుంది. దక్షిణాఫ్రికాలో బుధవారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కెప్టెన్సీని స్వీకరించిన కేఎల్ రాహుల్‌(KL Rahul)ను ఎంపిక చేసుకుంది. ఇది కాకుండా, రాహుల్‌తో పాటు పంజాబ్ కింగ్స్‌లో భాగమైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌(Ravi Bishnoi)ను కూడా చేర్చుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. మూడో ఆటగాడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌(Marcus Stoinis)ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ESPNcricinfo వెబ్‌సైట్ తన నివేదికలో ఈ సమాచారాన్ని పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం, లక్నో ఫ్రాంచైజీ ఫిబ్రవరిలో రూ. 60 కోట్లతో వేలానికి వెళ్లనుంది. రాహుల్ కోసం, ఈ ఫ్రాంచైజీ రూ. 15 కోట్లు ఇవ్వనుండగా, స్టోయినిస్‌ను రూ. 11 కోట్లకు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే రవి బిష్ణోయ్ రూ. 4 కోట్లు అందుకోనున్నాడు.

రాహుల్‌కు సూపర్ ఛాన్స్.. రాహుల్ గత రెండేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌లో నిరంతరంగా పరుగులు చేస్తున్నాడు. పంజాబ్ జట్టు ఈసారి కూడా అతనిని రిటైన్ చేయాలని భావించింది. కానీ, రాహుల్ జట్టును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. రాహుల్ అంతకుముందు 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులో ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. 2016లో మళ్లీ బెంగళూరు వచ్చాడు. 2011లో పంజాబ్ టీం రాహుల్‌ను తమతో చేర్చుకుంది.

గత సీజన్‌లో రవి బిష్ణోయ్ అద్బుత ప్రదర్శన.. అదే సమయంలో అండర్-19 ప్రపంచకప్ తర్వాత బిష్ణోయ్‌ని పంజాబ్ కొనుగోలు చేసింది. టీమిండియా అండర్-19 జట్టు 2020 ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ కప్‌లో రవి బిష్ణోయ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తన తొలి సీజన్‌లో బిష్ణోయ్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 2021లో పంజాబ్ తరఫున తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.

స్టోయినిస్ నాల్గవ ఫ్రాంచైజీలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కీలక ఆటగాళ్లలో స్టోయినిస్ ఒకరు. గత సీజన్లలో జట్టు సాధించిన విజయాల్లో ఈ ఆటగాడి పాత్ర కీలకం. అతను తన IPL కెరీర్‌ను 2015 నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబ్ నుంచి బెంగళూరుకు మారాడు. 2020లో మరలా ఢిల్లీకి వచ్చాడు.

Also Read:  IND vs SA: కోహ్లీ పేరిట ఎన్నో స్పెషల్ రికార్డులు..!

IND VS SA: ఆరో బౌలర్‌ కొరత తీరింది.. స్పిన్నర్లలో ఒకరికి ఛాన్స్: తొలి వన్డే ముందు కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు

IND vs SA: తొలి వన్డేలో గబ్బర్ రీ ఎంట్రీ.. రెండు స్పెషల్ రికార్డులపై కన్నేసిన లెఫ్ట్‌హ్యాండర్..!