Ind vs Sa: 5 ఏళ్ల తర్వాత తొలిసారి కోహ్లీ అలా.. తొలి వన్డేలో భారత ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?

Ind vs Sa, India Probable Playing 11: జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ పార్ల్‌లోని బోలాండ్‌ పార్క్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు..

Ind vs Sa: 5 ఏళ్ల తర్వాత తొలిసారి కోహ్లీ అలా.. తొలి వన్డేలో భారత ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
Ind Vs Sa, India Probable Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2022 | 7:35 PM

Ind vs Sa, India Probable Playing 11: జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా(India vs South Africa) జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ పార్ల్‌లోని బోలాండ్‌ పార్క్‌(Boland Park, Paarl)లో జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా(Team India)  ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత, ఈ సిరీస్ ప్రస్తుతం టీమిండియాకు చాలా కీలకంగా మారింది.

ఓపెనింగ్ జోడీ.. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ జోడీ టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చు. కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రాహుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో శిఖర్ ధావన్ అనుభవంతో జట్టుకు లాభం చేకూరనుంది. ధావన్ ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో ఆడాడు. అయితే గత కొన్ని రోజులుగా ధావన్ జట్టులో లేడు. రోహిత్ శర్మ జట్టులో లేకపోవడంతో ధావన్‌కు అవకాశం దక్కడం ఖాయం.

మిడిల్‌ ఆర్డర్‌.. మిడిల్ ఆర్డర్‌లో బలమైన విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు బాధ్యతాయుతంగా ఆడగలరు. 2017 తర్వాత తొలిసారిగా విరాట్ కోహ్లి టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ దృష్టి అంతా బ్యాటింగ్‌పైనే ఉంటుంది. అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 4లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

సూర్యకుమార్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నా పెద్దగా ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో, అతను ఖచ్చితంగా ఈ సిరీస్‌లో రాణించాలనే తపనతో ఉంటాడు. న్యూజిలాండ్‌తో జరిగిన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శ్రేయాస్ అయ్యర్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

హార్దిక్ నష్టాన్ని అయ్యర్ భర్తీ చేస్తాడా? టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్ ఫేజ్-2 నుంచి వెలుగులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్‌ తొలి వన్డేలో అరంగేంట్రం చేయనున్నాడు. ఫేజ్-2లో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేసి 3 వికెట్లు కూడా తీశాడు. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా స్థానంలో అయ్యర్ జట్టులోకి రావచ్చు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతో పాటు అవకాశం వచ్చినప్పుడు వికెట్లు కూడా తీయగలడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ అతనికి అవకాశం లభించింది.

శార్దూల్ ఠాకూర్‌కు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కడం కాస్త కష్టమే. టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఫ్లాప్‌ కావడంతో.. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ యువ ప్లేయర్ వెంకటేష్‌ అయ్యర్‌కు అవకాశం ఇవ్వనున్నారు.

చాహల్ అద్భుతాలు చేయవలసి ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో స్పిన్నర్‌గా ఆర్ అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ ఆడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో చాహల్ రికార్డు అద్భుతంగా ఉండడంతో ప్లేయింగ్ XIలో ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. అతను 7 మ్యాచ్‌ల్లో 15.65 సగటుతో 20 వికెట్లు తీశాడు. 22 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం చాహల్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

బలమైన పేస్ ఎటాక్.. ఫాస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు. అదే సమయంలో దీపక్ చాహర్‌కు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కడం కష్టమే. ఈ సిరీస్‌లో బుమ్రా మరోసారి పేస్ అటాక్‌ను బలోపేతం చేయనున్నాడు. భువనేశ్వర్ కుమార్ రెండో ఫాస్ట్ బౌలర్ పాత్రను పోషించబోతున్నాడు. తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్‌కు కూడా అవకాశం దక్కవచ్చు.

టీమిండియా ప్లేయింగ్ XI  అంచనా- కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Also Read: IPL 2022: లక్నో కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ ఫిక్స్.. రిటెన్షన్‌లో మరో ఇద్దరు కూడా..!

IND VS SA: ఆరో బౌలర్‌ కొరత తీరింది.. స్పిన్నర్లలో ఒకరికి ఛాన్స్: తొలి వన్డే ముందు కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే