ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బౌలర్లను చీల్చి చెండాడిన టిమ్ డేవిడ్.. కేవలం 21 బంతుల్లో 44 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గాను ఎంపికయ్యాడు. ఈ తుఫాను ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదేశాడు.
పేలవ ఇన్నింగ్స్‌తో ప్లేయింగ్ 11 నుంచి తొలగింపు..
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో టిమ్ డేవిడ్‌కి ఇది నాలుగో మ్యాచ్ మాత్రమే. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత డేవిడ్‌ను ముంబై జట్టు తొలగించింది. కానీ, ప్రస్తుతం తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న డేవిడ్.. ముంబై ఇండియన్స్ దూరంగా ఉంచడం చాలా పెద్ద తప్పు అని నిరూపించేలా చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ ప్లేయింగ్-11లో పునరాగమనం చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో డేవిడ్ 9 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
రూ.8.25 కోట్లకు ముంబై సొంతమైన డేవిడ్..
డేవిడ్ ఆస్ట్రేలియా మూలానికి చెందిన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. కేవలం 14 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 158 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 558 పరుగులు చేశాడు. ఐపీఎల్‌తో పాటు, బీబీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో కూడా టిమ్ డేవిడ్ తన సత్తా చాటుతున్నాడు.
IPL 2022 మెగా వేలంలో టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా, లక్నో, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ కూడా డేవిడ్‌ను రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు వేలంలో పోటీపడ్డాయి. టిమ్ డేవిడ్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పాల్గొన్న తొలి సింగపూర్ క్రికెటర్‌గా టిమ్ డేవిడ్ పేరుగాంచాడు.
మ్యాచ్ పరిస్థితి..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ కూడా 29 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ తరపున వృద్ధిమాన్ సాహా 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అదే సమయంలో, శుభమన్ గిల్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ముంబై తరపున మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: IPL 2022: గుజరాత్ ఓటమిలో ఆ బౌలర్‌దే కీలక పాత్ర.. ప్లాన్ చేసి ఓడించిన రోహిత్ సేన.. ఆ ప్లేయర్ ఎవరంటే?