IPL 2022: ఐపీఎల్ చరిత్రలో 100 క్యాచ్‌లు పట్టిన ప్లేయర్లు వీరే.. లిస్టులో చేరిన మరో ముంబై ప్లేయర్..

|

May 01, 2022 | 5:45 AM

ఐపీఎల్ 15లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌లో మరో పెద్ద ఘనత సాధించాడు.

IPL 2022: ఐపీఎల్ చరిత్రలో 100 క్యాచ్‌లు పట్టిన ప్లేయర్లు వీరే.. లిస్టులో చేరిన మరో ముంబై ప్లేయర్..
Ipl 100 Catches Players
Follow us on

ఐపీఎల్ 15(IPL)లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌(RR vs MI)తో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌లో మరో పెద్ద ఘనత సాధించాడు. అంతకు ముందు సురేష్ రైనా మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ క్యాచ్‌ను అందుకున్న కీరన్ పొలార్డ్(kieron pollard).. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 100వ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు సురేష్ రైనా ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్స్ వీరే..

మ్యాచ్‌లు  ప్లేయర్  క్యాచ్‌లు

205    సురేష్ రైనా    107

187    కీరన్ పొలార్డ్   100

222    రోహిత్ శర్మ    94

216   విరాట్ కోహ్లీ    89

201   శిఖర్ ధావన్   86

ఎట్టకేలకో విజయం..

డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఐపీఎల్ 2022లో భాగంగా 44వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాల ఖాతా తెరవలేకపోయింది. కాగా, ఎట్టకేలకు తొమ్మిదో మ్యాచ్‌లో తన తొలి విజయాన్ని అందుకుని, ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (51) టాప్ స్కోరర్ కాగా, తిలక్ వర్మ 35 పరుగులు చేశాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో వరుస పరాజయాల తర్వాత ప్రస్తుత టోర్నీలో ముంబైకి ఇదే తొలి విజయం.

కెప్టెన్ రోహిత్ శర్మ 35వ పుట్టినరోజు సందర్భంగా MI ఈ మ్యాచ్‌లో గెలిచినందున జట్టుకు ఈ విజయం కూడా ప్రత్యేకమైనది. అదే సమయంలో, 9 మ్యాచ్‌ల్లో RRకి ఇది మూడో ఓటమిగా నిలిచింది. ఇప్పటి వరకు ఆ జట్టు 6 మ్యాచ్‌లు గెలిచింది.

ఇరు జట్లు ఇలా..

రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), డారిల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.

ముంబై ఇండియన్స్ జట్టు: ఇషాన్ కిషన్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: RR Vs MI: ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు..

IPL 2022: వరుసగా 4 సిక్సులు.. ఐదో బంతికి అంపైర్ తప్పుడు నిర్ణయం.. కట్ చేస్తే.. ఆరో బంతికి షాకిచ్చిన ముంబై బౌలర్..