IPL 2022 Mega Auction: ఇదే చివరి మెగా వేలం.. ఐదేళ్ల తరువాత నిర్వహణ.. మరోసారి ఉండదంటోన్న నివేదికలు.. ఎందుకంటే?

| Edited By: Ravi Kiran

Nov 30, 2021 | 5:04 PM

IPL 2018 (IPL 2018) తర్వాత 15వ సీజన్ కోసం మెగా వేలం 2022లో జరగబోతోంది. ఇదే చివరి మెగా వేలం అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

IPL 2022 Mega Auction: ఇదే చివరి మెగా వేలం.. ఐదేళ్ల తరువాత నిర్వహణ.. మరోసారి ఉండదంటోన్న నివేదికలు.. ఎందుకంటే?
Ipl 2022 Mega Auction
Follow us on

IPL 2022 Mega Auction: వచ్చే ఏడాది జరగనున్న IPL (IPL 2022) 15వ సీజన్‌కు ముందు, రిటెన్షన్ ప్రక్రియ నవంబర్ 30న అంటే మంగళవారంతో ముగుస్తుంది. దీని తరువాత ఫ్రాంచైజీలందరి చూపు వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలంపై నెలకొంది. అప్పుడే జట్టులోని ఆటగాళ్ల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. వచ్చే ఏడాది IPLలో 8 జట్లకు బదులుగా 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారనుంది. లక్నో, అహ్మదాబాద్‌ల నుంచి రెండు కొత్త జట్లు తొలిసారి లీగ్‌లో పాల్గొంటాయి.

కాగా, ఈ మెగా వేలం చివరి మెగా వేలం కావచ్చని పలు మీడియా వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహిస్తున్నారు. మెగా వేలంలో, జట్లకు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే అవకాశం లభిస్తుంది. మిగతా ఆటగాళ్లందరూ డ్రాఫ్ట్‌కు వెళతారు. అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు తప్ప మిగతా అందరూ వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. మెగా వేలం తర్వాత తరచుగా జట్లలో పెద్ద మార్పులు ఉంటాయి. ఒక్కోసారి టీమ్ మొత్తం మారిపోతుంది. దీని తరువాత జరిగే పోటీల్లో ఆయా టీంలలో కత్తిరింపులు మాత్రమే చేయనున్నారు.

వచ్చే ఏడాది చివరి మెగా వేలం..
మెగా వేలం 2022 తర్వాత లేదా చాలా కాలం తర్వాత జరుగుతుందని లేదా అది అస్సలు జరగదని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వేలం తర్వాత, జట్లు వారి స్వంత టీంను ఏర్పరుచుకుని ముందుకు సాగనున్నారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదు. ఆటగాళ్లు తమ జట్లతో ఎక్కువ కాలం అనుబంధం ఉండే విధంగా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లాగా ఉంటుందనేది ఆయా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే, ఈ మెగా వేలం జట్లకు మరింత ముఖ్యమైనది కానుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ వేలం వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరగనుంది.

చివరి మెగా వేలం 2018లో జరిగింది..!
అంతకుముందు, చివరి మెగా వేలం 2018 సంవత్సరంలో జరిగింది. రెండేళ్ల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తిరిగి వచ్చాయి. ఈ వేలం తర్వాత, చాలా జట్ల కోర్ గ్రూప్ పూర్తిగా మారిపోయింది. వచ్చే ఏడాది కూడా అదే అంచనా వేయవచ్చు. విశేషమేమిటంటే.. మెగా వేలంలో ఇప్పటి వరకు 8 టీమ్‌లు మాత్రమే పాల్గొన్నాయి అయితే 2022లో మాత్రం 10 టీమ్‌లు పాల్గొంటాయి. ఐపీఎల్‌లో లక్నో, అహ్మదాబాద్‌లు రెండు కొత్త టీంలు వచ్చాయి. కోల్‌కతాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా RP-SG గ్రూప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లక్నో ఫ్రాంచైజీని రూ. 7090 కోట్లకు కొనుగోలు చేయగా, అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడి సంస్థ CVC క్యాపిటల్ రూ. 5,600 కోట్లకు బిడ్డింగ్ ద్వారా అహ్మదాబాద్ ఫ్రాంచైజీని గెలుచుకుంది.

Also Read: IPL 2022 Retention Live Streaming: ఎనిమిది జట్లలో ఉండేదెవరో.. ఆక్షన్‌కు వెళ్లేదెవరో? మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 రిటెన్షన్ జాబితా..!

Ravichandran Ashwin: అదే నాకు ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ .. తన రిటైర్మెంట్‌ గురించి నాలుగేళ్ల క్రితమే చెప్పేసిన అశ్విన్‌..