IPL 2022: ఐపీఎల్ వేలంలో దీపక్ చాహర్‌ని 14 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి కొనుగోలు చేసింది. IPL వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. దీనిపై చాహర్ స్పందిచాడు.14 కోట్లంటే చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ నుంచి తప్పుకుంటుందేమో అని భయపడ్డానని అంతకంటే తక్కువైనా అదే జట్టుకి ఆడాలనుకున్నానని తన మనసులో మాటని వెల్లడించాడు. ” మేమందరం అహ్మదాబాద్ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్నాము. ఫోన్‌లో వేలం చూస్తున్నాం. అందరూ ‘కిత్నా హో గయా?’ అని అడిగారు. 14 కోట్ల వరకు వచ్చేసరికి ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే వేలం నుంచి CSK వైదొలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను CSK తరపున ఆడాలని కోరుకున్నాను. ” అని చాహర్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.
ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను వేలానికి ముందు రిటైన్ చేసినందున మేనేజ్‌మెంట్ చాహర్‌ను రిలీజ్ చేసింది. దీని గురించి చాహర్ మాట్లాడుతూ.. ‘రిటెన్షన్‌పై కెప్టెన్ ధోనీతో కానీ మేనేజ్‌మెంట్‌తో కానీ తాను ఎప్పుడూ చర్చలు జరపలేదని అయితే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు తనని కచ్చితంగా ఎంపిక చేస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌లోకి తిరిగి వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉన్నానని’ చెప్పాడు.
Deepak Chahar tells he felt bidding should stop at 13 crores for him and want CSK to spend more on other players.. CSK is not just another team.. Its an emotion ? pic.twitter.com/xU3d6ELzuD
— mvrkguy (@mvrkguy) February 13, 2022