LSG vs MI: ముంబై పై లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో నిలిచింది. లక్నో జట్టుకి ఏ పరిస్థితిలోను పోటీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. రోహిత్ శర్మ 39, తిలక్ వర్మ 38 పరుగులు చేశారు. మిగతా వారు ఎవ్వరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టగా.. మోహ్‌సిన్ ఖాన్, హోల్డర్, రవి బిష్ణోయ్, బదోనీ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచాడు. కేవలం 62 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మానీష్ పాండే 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో రిలే మెరెడిత్ నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కీరన్ పొలార్డ్ 2 ఓవర్లకు గాను 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ సాధించారు.
మరిన్ని క్రికెట్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి