ఐపీఎల్(IPL) మ్యాచ్‌లు హైబీపీకి వేదికవుతున్నాయి. గుజరాత్ టైటన్స్ – ఆర్‌సీబీ(GT vs RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ ప్లేయర్ మ్యాథ్యూ వేడ్(Matthew Wade) వీరంగం సృష్టించాడు. ఆర్‌సీబీ బౌలర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్లు ఔట్ అయినట్టు అంపైర్ నిర్ణయం ప్రకటించడంతో వేడ్‌కు చిర్రెత్తుకొచ్చింది. రివ్యూలో కూడా ఔట్ అని తేలడంతో మరింత రెచ్చిపోయాడు. గ్రౌండ్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన వేడ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విధ్వంసం సృష్టించాడు. హెల్మెట్ పగులకొట్టాడు. తరువాత బ్యాట్‌ను నేలకేసి విసిరికొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని అద్దాలను కూడా పగులకొట్టాడు. వేడ్‌కు నచ్చచెప్పడానికి విరాట్ కోహ్లి చాలా ప్రయత్నించాడు. అయినప్పటికి వినలేదు. తన ప్రతాపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్ గుజరాత్ టైటన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కాగా, ఆరో ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన రెండో బంతికి వేడ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. 13 బంతుల్లో 16 పరుగులు మాత్రమే సాధించి పెవిలియన్ బాట పట్టాడు. అక్కడ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతాపం చూపించాడు. గుజరాత్ టైటన్స్ వాస్తవానికి ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్‌లో నిలిచింది. ప్లేఆఫ్ లోకి కూడా వెళ్లిపోయింది. అయినప్పటికీ మాథ్యూ వేడ్‌లో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరింది. అయితే, బెంగళూర్ టీమ్ కీలక మ్యాచ్‌లో సత్తా చాటి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 168 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన బెంగళూర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కీలక మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
Mathew wade very angry after lbw out?? pic.twitter.com/DG8v5430kq
— Ajay Kumar (@Kum9117Ajay) May 19, 2022