IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరులో జరుగుతుంది. మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ మెగా వేలానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
370 మంది భారతీయులు, 220 మంది విదేశీ ఆటగాళ్లు..
ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ఖరారు చేసిన 590 మంది ఆటగాళ్లలో 370 మంది భారతీయులు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో భారత్ తర్వాత అత్యధికంగా 47 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియానే నిలిచింది. 590 మంది ఆటగాళ్లలో 228 మంది ఆటగాళ్లు ఇంతకు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని ఆటగాళ్లు 335 మంది ఉన్నారు.
వేలం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..
వేలం ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
ఐపీఎల్ 2022 వేలం షెడ్యూల్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
టీవీ వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వేలాన్ని చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఐపీఎల్ వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అదే సమయంలో, దాని ప్రత్యక్ష ప్రసారం ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.
అలాగే ఐపీఎల్ వేలానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను టీవీ9 తెలుగు లైవ్ టీవీలో చూడొచ్చు. దీంతో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ మెగా వేలానికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ను పొందగలరు.
Also Read: IPL 2022 Auction: ధోని నుంచి కోహ్లీ వరకు.. ఈ ఆల్ రౌండర్‌పైనే చూపు.. అత్యధిక ధర పొందే ఛాన్స్?