IPL 2021: కరోనా ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ నుంచి ఇద్దరు స్టార్‌ అంపైర్లు ఔట్‌.! వారెవరంటే..?

|

Apr 30, 2021 | 7:33 AM

ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్‌ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌-14వ సీజన్‌ను వీడారు.

IPL 2021: కరోనా ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ నుంచి ఇద్దరు స్టార్‌ అంపైర్లు ఔట్‌.! వారెవరంటే..?
Follow us on

ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్‌ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌-14వ సీజన్‌ను వీడారు. ఇక తాజాగా ఇద్దరు స్టార్‌ అంపైర్లు కరోనా కారణంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నారు. భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ రీఫెల్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నారు.

ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ సభ్యులైన వీరిద్దరూ.. ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నితిన్‌ ఇంట్లో వాళ్లందరూ.. కరోనా బరినపడటంతో.. వారితో ఉండటం కోసమే తాను టోర్నీ నుంచి వైదొలిగిన్నట్లు తెలిపాడు. ఇక రీఫెల్‌ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమాన రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమైన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆండ్రూ టై, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు ఐపీఎల్‌ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. దేశంలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.