IPL 2021: ఐపీఎల్‌కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం.!

IPL 2021: మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. అయితే అంతకన్నా ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. లీగ్ నుంచి..

IPL 2021: ఐపీఎల్‌కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 01, 2021 | 7:17 PM

IPL 2021: మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. అయితే అంతకన్నా ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. లీగ్ నుంచి స్టార్ ఆటగాడు జోష్ హజిల్‌వుడ్ తప్పుకున్నాడు. బయోబబుల్ వాతావరణంలో గడపడం తనకు ఇబ్బందిగా ఉందంటూ ఈ ఆసీస్ పేసర్ చెన్నై యాజమాన్యానికి తెలిపాడు. అందుకే ఈ సంవత్సరం టోర్నీ నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించాడు. దీనితో ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు.

బయోబబుల్ కష్టం అంటున్న ఆటగాళ్లు…

ఐపీఎల్ నుంచి ఇప్పటికే ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు తప్పుకున్న సంగతి తెలిసిందే. బయోబబుల్ వాతావరణంలో తాము గడపడం ఇబ్బందిగా ఉందని.. అందుకే తప్పుకుంటున్నట్లు ఆర్సీబీ ప్లేయర్ జోష్ ఫిలిప్, సన్‌రైజర్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్ తెలిపారు. వారి కోవలోనే ఇప్పుడు హజిల్‌వుడ్ కూడా ఇదే కారణంతో తప్పుకున్నాడు.

బయోబబుల్, క్వారంటైన్ జీవితాన్ని గడపలేనని.. కుటుంబంతో మరింత సమయం గడపాలని అనుకుంటున్నట్లు హజిల్‌వుడ్ తెలిపాడు. కాగా, ఐపీఎల్ 2020 వేలంలో హజిల్‌వుడ్‌ను చెన్నై యాజమాన్యం దక్కించుకుంది. ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన హజిల్‌వుడ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!