IPL 2021: ఈ హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ పై ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

|

Apr 30, 2021 | 7:19 AM

హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించడం ఏంటి.? అసలు ఆ ఆటగాడు ఎవరు.? సంగతేంటి.? అని ఆలోచిస్తున్నారా.!

IPL 2021: ఈ హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ పై ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?
Deccan Chargers 1
Follow us on

హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించడం ఏంటి.? అసలు ఆ ఆటగాడు ఎవరు.? సంగతేంటి.? అని ఆలోచిస్తున్నారా.! అయితే ఇది తెలుసుకోండి. ఐపీఎల్ లో హైదరాబాద్ దక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీలంకన్ మాజీ ఫాస్ట్ బౌలర్ నువాన్ జోయెస్సాపై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడిపై ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ నిషేధం విధించింది. దీనితో జోయెస్సాపై నిషేధం 2018 అక్టోబర్ 31 నుండి అమలులోకి వచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ 2008లో శ్రీలంక క్రికెటర్ నువాన్ జోయెస్సా హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్టు పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా మారింది. ఇక బుధవారం జరిగే ఐపీఎల్-2021 మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!