ఆర్‌సీబీ మరోసారి ఓడింది…ఢిల్లీ కాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది

|

Apr 29, 2019 | 11:46 AM

ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ మొదలైంది. ఫెరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో తన బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే పార్థివ్ పటేల్ 39 పరుగులు […]

ఆర్‌సీబీ మరోసారి ఓడింది...ఢిల్లీ కాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది
Follow us on

ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ మొదలైంది. ఫెరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో తన బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే పార్థివ్ పటేల్ 39 పరుగులు చేసి వెనుదిరగడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆ తర్వాత రెండో బంతికే కోహ్లీ సైతం ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డివిలీర్స్, దూబే కాస్త ఆదుకున్నప్పటికీ స్కోరు బోర్డు వేగం మాత్రం మందగించింది. చివర్లో గురుకీరత్ సింగ్, స్టోయినిస్ మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నంచేసినా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బెంగుళూరు 171 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు బెంగుళూరును 16 పరుగుల తేడాతో ఓడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శిఖర్ ధావన్ (50), శ్రేయస్ అయ్యర్ (52) రాణించారు. చివర్లో రూథర్ ఫోర్డ్ 6 సిక్సర్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అయితే ఈ విజయంతో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే కాదు పాయింట్ల పట్టికలోనూ మొదటి స్థానంలో నిలిచింది.