ఐసీసీ కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. మూడు ఫార్మాట్లకు సంబంధించి కొత్త ర్యాంకింగ్స్‌ను బుధవారం (డిసెంబర్ 6) ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ కొత్త ర్యాంకింగ్ జాబితాలో టీమిండియా ఆటగాళ్లదే ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలవడం విశేషం. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉంటే, టీ20 క్రికెట్ బ్యాటర్ల విభాగంలో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ టాప్-1లో ఉండగా, టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే టీ20 బౌలర్ల జాబితాలో టీమిండియా నయా సెన్సేషన్ రవి బిష్ణోయ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన ఈ యంగ్ స్పిన్నర్.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నాడు.
ఇవి కాకుండా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్‌లో 7వ స్థానంలో నిలిచాడు. అలాగే టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. దీని ప్రకారం ఐసీసీ కొత్త టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.
Congratulations #RaviBishnoi on becoming the no. 1 T20I bowler.
Another excellent achievement that highlights @BCCI India’s increasing vigour in international cricket.#RaviBishnoi #Cricket #India #BCCI #IDCA #DCCI pic.twitter.com/gVA0vwxmKJ
— INDIAN DEAF CRICKET ASSOCIATION (IDCA)🇮🇳 (@indian_deaf) December 6, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..