IND W VS ENG W: టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఝులన్ గోస్వామికి హర్మన్ ప్రీత్ సేన ఘనమైన వీడ్కోలు అందించినట్లయింది. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత హర్మన్ సేనకు ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లు లేవు. వన్డే వరల్డ్‌కప్- 2023తోనే మళ్లీ టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్ పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు లండన్ ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్ చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఝులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. మోడల్స్‌ను అనుకరిస్తూ ర్యాంప్‌వాక్ చేశారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలను జెమీమా రోడ్రిగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.
కాగా స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఝులన్ గోస్వామి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు కోల్‌కతా విమానాశ్రయంలో అభిమానులు సాదర స్వాగతం పలికారు. కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమయింది. మ్యాచ్ ఓడిపోవడంతో చార్లీ డీన్ కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. దీంతో దీప్తి శర్మ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడిందంటూ ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో దీప్తి నిబంధనలకు అనుగుణంగానే మన్కడింగ్ చేసిందంటూ చాలామంది క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియా క్రికెటర్‌కు మద్దతు తెలిపారు.
i’ve never loved a team more?
from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB
— s (@_sectumsempra18) September 26, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..