IND vs ENG 1st Test Match: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసింది. టీమిండియా విజయం దాదాపు ఖరారైందని అంతా భావించిన తరుణంలో వర్షం ఆశలను ఆడియాలు చేసింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ఆగిపోయింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చివరి సెషన్ వరకు వేచి చూసిన అంప్లైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 157 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా భారత్ విజయాన్ని వరుణుడు అడ్డుకున్నట్లైంది. ఇక భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో నిలిచింది. రోహిత్ శర్మ(12), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కేఎల్ రాహుల్(26) ధాటిగా ఆడుతూ బ్రాడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లతో పడొట్టారు.
UPDATE: Play has been abandoned. ☹️
The first #ENGvIND Test at Trent Bridge ends in a draw.
We will see you at Lord’s for the second Test, starting on August 12. #TeamIndia
Scorecard ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/k9G7t1WiaB
— BCCI (@BCCI) August 8, 2021
Also Read: TTD: శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కేసులో రెండో ఛార్జ్ షీట్ పరిస్థితేంటి? ఎంత వరకూ వచ్చింది?