
England U19 vs India U19, 2nd Youth Test: చెమ్స్‌ఫోర్డ్‌లో జరుగుతున్న భారత్ అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య రెండో యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు విహాన్ మల్హోత్రా అద్భుతమైన శతకం సాధించి తన సత్తా చాటాడు. ఈ కీలకమైన ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు పటిష్ట స్థితికి చేరుకోవడంలో మల్హోత్రా కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ కాగా, భారత యువ బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ రూపంలో తక్కువ పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, క్రీజులోకి వచ్చిన విహాన్ మల్హోత్రా, కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మాత్రే కూడా చక్కగా ఆడుతూ శతకానికి చేరువయ్యాడు. కానీ, 80 పరుగుల వద్ద కీలక సమయంలో వికెట్ కోల్పోయాడు. మాత్రే సెంచరీని మిస్ చేసుకున్నప్పటికీ, విహాన్ మల్హోత్రా మాత్రం తన బ్యాటింగ్‌ను కొనసాగించి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అతను 123 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో కలిపి 120 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు. అతని దూకుడుతో కూడిన బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది.
విహాన్ మల్హోత్రా, ఆయుష్ మాత్రే మధ్య ఏర్పడిన భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు భారత్ భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. మాత్రే నిష్క్రమణ తరువాత భారత జట్టు స్వల్ప వ్యవధిలోనే కొన్ని వికెట్లను కోల్పోయినప్పటికీ, విహాన్ మల్హోత్రా చూపిన పోరాట పటిమ ప్రశంసనీయం.
రెండో యూత్ టెస్టులో విహాన్ మల్హోత్రా సాధించిన ఈ సెంచరీ, అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని, ఒత్తిడిలో రాణించగల సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ ఇన్నింగ్స్ భారత్ అండర్-19 జట్టుకు ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి దోహదపడింది. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు విహాన్ మల్హోత్రా ఒక ఆశాకిరణంగా నిలుస్తాడని అతని ప్రదర్శనతో స్పష్టమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..