టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ టీమ్ ఇండియాలో కనిపించాడు. 2024 ఐపీఎల్ సమయంలో గాయపడిన రాహుల్ కోలుకున్న తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున ఆడాడు. కానీ లంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్ ప్రదర్శన అంతంత మాత్రమే. దీంతో మూడో వన్డే నుంచి రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. లంకతో సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన రాహుల్‌కు మళ్లీ భారత జట్టులో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలంటున్నారు క్రికెట్ నిపుణులు. వీటన్నింటి మధ్య, KL రాహుల్ గురించి సోషల్ మీడియాలో ఒక పుకారు మొదలైంది. కేఎల్ రాహుల్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్‌లో రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ‘చాలా ఆలోచించిన తర్వాత, ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ నా జీవితంలో ముఖ్యమైన భాగమైనందున ఈ నిర్ణయం అంత సులభం కాదు. నా కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, సహచరులు అభిమానులకు కృతజ్ఞతలు. మైదానంలోనూ, బయటా నేను పొందిన అనుభవాలు జ్ఞాపకాలు నిజంగా వెలకట్టలేనివి. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను. చాలా మంది ప్రతిభావంతులైన దిగ్గజ క్రికెటర్లతో ఆడినందుకు సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఈ పోస్ట్ లో రాసి ఉంది.
నిజానికి కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు . ‘ఇవాళ ఒక ప్రకటనతో వస్తున్నాను..వేచి ఉండండి’ అని అందులో పేర్కొన్నాడు. అయితే అది అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ కు సంబంధించినది కాదు. కానీ ఈ పోస్ట్ ను కొందరు నెటిజన్లు వేరేలా ప్రచారం చేస్తున్నారు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు.
KL Rahul Announced His Retirement From International Cricket
All the best for new journey #KLrahul pic.twitter.com/PTLqo8IsLy— Sai Adabala (@adabala_d) August 22, 2024
2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున 50 టెస్టులు, 77 వన్డేలు, 72 టీ20లు ఆడాడు. ఇందులో రాహుల్ టెస్టుల్లో 2863 పరుగులు, వన్డేల్లో 2851 పరుగులు, టీ20ల్లో 2265 పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రాహుల్ ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..