టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్ కొన్ని నెలల క్రితమే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్లిపోయింది. కొన్ని రోజులు అక్కడే ఉన్న ఆమె ఇటీవలే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చింది. గతంలో లాగే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. మరోవైపు హార్దిక్ కూడా క్రికెట్ మ్యాచ్ లతో బిజీ అయిపోయాడు. ఇక కుమారుడు అగస్త్య మాత్రం ఎక్కువగా పెదనాన్న కృనాల్ పాండ్యా దగ్గరే ఉంటున్నాడు. కృనాల్ భార్య పాంఖురినే అగస్త్య ఆలనాపాలనా చూసుకుంటోంది. ఇక హార్దిక్ కూడా వీలైనంత ఎక్కువ సమయం కుమారుడితో గడిపేందుకే ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ తండ్రీ కొడుకులకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హార్దిక్ పాండ్యా తన కుమారుడికి సంబంధించిన ఓ ఫొటోను అందరితో పంచుకున్నాడు. ఇందులో కొడుకు అగస్త్య ఆడుకుంటుండగా హార్దిక్ పిల్లాడి ఒడిలో నిద్రిస్తూ కనిపించాడు. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన హార్దిక్.. ‘ ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. క్యూటెస్ట్ ఫొటో అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ 20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం వచ్చే నెల 8 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సిరీస్ కు ముందు కొంచెం విరామం దొరకడంతో ఆ విలువైన సమయాన్ని తన కుమారుడితో గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తన కొడుకు అగస్త్యతో దిగిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.