Team India: రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న భారత ఆటగాళ్లు.. తొలుత ప్రధానితో మీటింగ్.. ఆ తర్వాత ఓపెన్ బస్సులో పరేడ్..

|

Jul 03, 2024 | 12:14 PM

Indian Team Open Bus Parade In Mumbai: బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు త్వరలో భారత్ చేరుకోనుంది. ఈరోజు అర్థరాత్రికి టీమ్ ఇండియా భారత్ చేరుకోనుంది. ఆ తర్వాత భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సి ఉంది. ఆ తర్వాత, 2007 టీ20 ప్రపంచ కప్ మాదిరిగానే ముంబైలో టీమ్ ఇండియా ఓపెన్ బస్సులో పరేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Team India: రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న భారత ఆటగాళ్లు.. తొలుత ప్రధానితో మీటింగ్.. ఆ తర్వాత ఓపెన్ బస్సులో పరేడ్..
Team India Open Bus Parade
Follow us on

Indian Team Open Bus Parade In Mumbai: బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు త్వరలో భారత్ చేరుకోనుంది. ఈరోజు అర్థరాత్రికి టీమ్ ఇండియా భారత్ చేరుకోనుంది. ఆ తర్వాత భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సి ఉంది. ఆ తర్వాత, 2007 టీ20 ప్రపంచ కప్ మాదిరిగానే ముంబైలో టీమ్ ఇండియా ఓపెన్ బస్సులో పరేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ రెండోసారి గెలుచుకుంది. 2007లో టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఇప్పుడు 2024లో టైటిల్‌ను గెలుచుకుంది. 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలో టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు, మొత్తం జట్టును ఓపెన్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ సమయంలో వేలాది మంది అభిమానులు గుమిగూడారు.

ముంబైలో ఓపెన్ బస్సులో టీమ్ ఇండియా ప్రయాణం..

ఈసారి కూడా అలాంటిదే కనిపించవచ్చు. నివేదికల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత, ముంబైలో ఓపెన్ బస్సులో టీమిండియా కవాతు ఉండవచ్చు.

2007 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకున్న తర్వాత ముంబైలో పరేడ్ నిర్వహించినప్పుడు, ముంబై మొత్తం స్తంభించిపోయినట్లు అనిపించింది. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్, ఎంఎస్ ధోనీ కూడా ముంబైలో ఓపెన్ బస్సులో చక్కర్లు కొట్టారు.

టీమ్ ఇండియా ఈలోగా ఇంటికి చేరుకునేది. అయితే, బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, జట్టు అక్కడే ఉండాల్సి వచ్చింది. తుఫాన్ కారణంగా, బార్బడోస్‌లోని విమానాశ్రయం ఇప్పుడు మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు.

ఆ తరువాత, BCCI ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి రానున్నారు. ఈరోజు రాత్రి 1 గంట తర్వాత ఆటగాళ్లు భారత్ చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..