Team India: ఐపీఎల్ వద్దంది.. టీమిండియా రమ్మంది.. ఆ యంగ్ ప్లేయర్‌కు టెస్ట్ జట్టులో చోటిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?

|

Feb 20, 2022 | 7:30 AM

ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంకతో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. అత్యంత షాకింగ్ అయిన విషయం ఏమింటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన..

Team India: ఐపీఎల్ వద్దంది.. టీమిండియా రమ్మంది.. ఆ యంగ్ ప్లేయర్‌కు టెస్ట్ జట్టులో చోటిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?
Uttar Pradesh All Rounder Saurabh Kumar
Follow us on

Uttar Pradesh All rounder Saurabh Kumar: ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంక(IND vs SL)తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌కు భారత జట్టు(Team India)ను ప్రకటించారు. అత్యంత షాకింగ్ అయిన విషయం ఏమింటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్‌ను టీమిండియాలోకి ఆహ్వానించడం. ఈ 28 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సౌరభ్‌ను టెస్టు జట్టులోకి బీసీసీఐ చేర్చింది. అయితే, ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సౌరభ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సౌరభ్ బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే. అయినా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. 2021 వేలంలో, సౌరభ్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

బాగ్‌పత్ నివాసి సౌరభ్‌కు సర్వీసెస్ నుంచి మొదటి అవకాశం లభించింది. సౌరభ్ కుమార్ భారతదేశ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సుపరిచితమైన పేరు. సౌరభ్ 2014లో హిమాచల్ ప్రదేశ్‌తో సర్వీసెస్ తరపున తన తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. తర్వాత తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ తరఫున ఆడడం ప్రారంభించాడు.

196 వికెట్లు.. రెండు సెంచరీలు కూడా..
సౌరభ్ కుమార్ ఇప్పటివరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 24.15 సగటుతో 196 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 16 సార్లు ఐదు వికెట్లు, ఒక మ్యాచ్‌లో 6 సార్లు 10 వికెట్లు తీశాడు. బ్యాట్స్‌మెన్‌గా, అతను 29.11 సగటుతో 1572 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

టీమిండియా ఏ జట్టుతో దక్షిణాఫ్రికాకు వెళ్లాడు..
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారతదేశం ఏ జట్టులో సౌరభ్ కుమార్ భాగమయ్యాడు. అయితే అక్కడ అతను రాణించలేకపోయాడు. అతను రెండు అనధికారిక టెస్టుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అలాగే కేవలం 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

రోహిత్ ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పటికే టీ20, వన్డే జట్లకు సారథిగా వ్యవహరిస్తోన్న రోహిత్‌ను, నేడు బీసీసీఐ టెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్‌ను చేసింది. శ్రీలంకతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అందులో సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానేలను టెస్ట్ జట్టు నుంచి తప్పించింది. ఇక వైస్ కెప్టెన్‌గా బుమ్రా ఎంపికయ్యాడు. అలాగే టీ20 జట్టులోకి చాలా ఏళ్ల తరువాత శాంసన్ తిరిగి వచ్చాడు.

కాగా ఫిబ్రవరి 24న లక్నో వేదికగా టీ 20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్‌ ప్రారంభమవుతోంది. ఆతర్వాత ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్కడి నుంచి రెండు జట్లు‌‌‌‌‌‌‌ మొహాలీకి చేరుకుంటాయి. మొదటి‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ (మార్చి 3–7) అక్కడే జరగనుండగా, రెండో డే నైట్ టెస్ట్‌ మ్యాచ్‌ ‌‌‌‌(మార్చి12–16) బెంగళూరు వేదికగా జరగనుంది.

శ్రీలంకతో టీ-20 మ్యాచ్‌లకు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, యుజువేంద్రా చాహల్‌, కుల్‌ దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ఆవేశ్‌ ఖాన్‌

టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషభ్‌ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా (వైస్ కెప్టైన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్.

Also Read: Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..