U19 Womens T20 World Cup: అమ్మాయిలు అదరగొట్టేశారు.. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చిత్తు

మన అమ్మాయిలు అదరగొట్టేశారు. మలేషియా వేదికగా జరుగుతోన్న అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 02) న ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా భారత మహిళల జట్టు రెండో సారి విశ్వవిజేతగా అవతరించింది.

U19 Womens T20 World Cup: అమ్మాయిలు అదరగొట్టేశారు.. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చిత్తు
Teamindia

Updated on: Feb 02, 2025 | 2:46 PM

భారత్ విశ్వ విజేతగా అవతరించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వ విజేతగా ఆవిర్భవించింది. తద్వారా వరుసగా రెండవ U-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో తెలంగాణ అమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ చాటింది. మొదట బౌలింగ్ లో మూడు వికెట్ల పడగొట్టిన ఈ తెలుగు తేజం ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది.  44 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. .ప్రపంచకప్ విజయం తో టీమ్ ఇండియా కొత్త సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా రెండో ప్రపంచకప్ విజయం తర్వాత అండర్-19 మహిళల టీమ్ ఇండియాకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో షఫాలీ వర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా మొదటి అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ ని గెల్చుకుని భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు.

 

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ  భారత బౌలర్ల ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లు మోకరిల్లారు. దక్షిణాఫ్రికా స్కోరులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.  భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా  20 ఓవర్లలో 82 పరుగులకే చాప చుట్టేసింది. టీమిండియా తరఫున అత్యధికంగా  గొంగడి త్రిష 3 వికెట్లు తీయగా,  పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు తీశారు.   షబ్నమ్ షకీల్ ఒక వికెట్ తీసింది.

   ఆడుతూ పాడుతూ విజయం..

తెలుగమ్మాయి ఆలౌరౌండ్ షో..

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి కమలిని (వికెట్ కీపర్), గోంగ్డి త్రిష, ఈశ్వరి వసారే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషితా విజె, షబ్నమ్ ఎండి షకీల్, పరుణికా సిసోడియా,  వైష్ణవి శర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..