AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ZIM 3rd ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఆ యంగ్ ప్లేయర్‌కు మరోసారి నిరాశే.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..

India vs Zimbabwe Todays Match Prediction Squads: ఇప్పటికే వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్, మూడో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది.

IND Vs ZIM 3rd ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఆ యంగ్ ప్లేయర్‌కు మరోసారి నిరాశే.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
India Vs Zimbabwe 3rd Odi Playing Xi
Venkata Chari
|

Updated on: Aug 22, 2022 | 12:46 PM

Share

IND Vs ZIM 3rd ODI Playing XI: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్ కోసం, ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత జట్టు 2 ప్రధాన మార్పులు చేసింది. కేఎల్ రాహుల్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణలకు విశ్రాంతినివ్వగా, దీపక్ చాహర్, అవేష్ ఖాన్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఈ సిరీస్‌లో రీతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అదే సమయంలో ఆసియా కప్‌లో జట్టులోకి ఎంపికైన అవేశ్ ఖాన్ కూడా తొలిసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ XI:

భారత జట్టు – కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే జట్టు: కైటానో, ఇన్నోసెంట్ కయ్యా, టోనీ మున్యోంగా, రెగిస్ చకబ్వా, సికందర్ రజా, సీన్ విలియమ్స్, ర్యాన్ బుర్లే, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యూచి, రిచర్డ్ న్గర్వా.