IND Vs WI: అన్‌లక్కీ ప్లేయర్‌కు మళ్లీ నిరాశే.. డకౌట్ స్టార్‌కు ఛాన్స్.. తొలి వన్డేకు తుది జట్టు ఇదే!
టెస్టు సిరీస్ ముగిసింది. ఇక వన్డే సిరీస్‌లో సత్తా చాటేందుకు టీమిండియా ఉవ్విళ్ళూరుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తొలి వన్డే గురువారం కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహంగా జరిగే ఈ సిరీస్‌లో విజయం సాధించాలని భారత జట్టు తహతహలాడుతుంటే.. గట్టి పోటీని ఇచ్చేందుకు విండీస్ ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌కు ఈసారి కూడా నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. డకౌట్ స్టార్ కోసం.. మొదటి వన్డేకు శాంసన్‌ను పక్కపెట్టేందుకు చూస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ఇటీవల పలు వన్డే సిరీస్‌లలో టీ20 విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తడబడుతున్నాడు. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఇన్నిసార్లు పేలవ ప్రదర్శన కనబరిచినా.. మరోసారి అతడికి అవకాశాన్ని ఇస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ఇక వికెట్ కీపర్‌గా టెస్టుల్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్‌కే మొదటిగా ఛాన్స్ ఇవ్వొచ్చు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకుంటారు.
అటు విండీస్‌లోనూ పలు యువ ప్లేయర్స్, హార్డ్ హిట్టర్లు కూడా బరిలోకి దిగుతున్నారు. ఈసారి వెస్టిండీస్ జట్టు.. గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పిచ్‌పై ఏడాది క్రితం జరిగిన వన్డేలో బౌలర్లు రాణించగా.. ఇప్పుడు బ్యాటర్లకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కానీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది.
భారత్(ప్రాబబుల్ 11):
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్
విండీస్(ప్రాబబుల్ 11):
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జైడెన్ సీల్స్/యానిక్ కరియా