Watch Video: కోహ్లీకి భారీ షాకిచ్చిన లంక బౌలర్.. దెబ్బకు మిడిల్ వికెట్ ఎగిరిపోయిందిగా.. వైరల్ వీడియో..
Virat Kohli Out Video: జట్టు వెటరన్ విరాట్ కోహ్లీ శ్రీలంకపై ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. సున్నాతో ఔటయ్యాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ సమయంలో భారత్ తొలి రెండు వికెట్లు చాలా త్వరగానే పడ్డాయి. కేఎల్ రాహుల్ 6 పరుగులకే అవుటయ్యాడు. కాగా విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవలేకపోయాడు. కోహ్లీ ఔటైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడిని శ్రీలంక అత్యుత్తమ బౌలర్ దిల్షాన్ మధుశంక అవుట్ చేశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఈ సమయంలో రాహుల్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని అవుట్ అయిన తర్వాత, కోహ్లి 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. కానీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. 4 బంతుల్లోనే సున్నా స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యాడు. తన బంతికి దిల్షాన్ టీమిండియా స్టార్ ప్లేయర్ ను బలిపశువుగా మార్చేశాడు. కోహ్లి ఔట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




Virat Kohli registered his first ever duck in Asia Cup history.#ViratKohli #KingKohli #AsiaCup2022 #INDvSL pic.twitter.com/mTYNnpI3tu
— المؤيد ÃDÑÅN KHÄN (@AdnanDnkhn16) September 6, 2022
సూపర్ ఫోర్‌లో భారత్‌కి ఇది రెండో మ్యాచ్ . అంతకుముందు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీం ఇండియా రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 8న జరగనుంది. గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. మొదట పాకిస్తాన్‌ను ఓడించిన భారత్, ఆపై హాంకాంగ్‌ను ఓడించింది.
