IND vs SL: రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. లంక టార్గెట్ 174.. స్డేడియం రికార్డులు చేస్తే భారత్ గెలుపు సాధ్యమయ్యేనా?
IND vs SL T20 Score Live Updates: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పొయి 173 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

IND vs SL: ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పొయి 173 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల టార్గెట్ ను ఉంచింది. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. ఆర్ అశ్విన్ స్థానంలో గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కింది.
రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..




ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌కు ప్రారంభంలోనే 2 ఎదురుదెబ్బలు తగిలాయి. విరాట్, కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. దీని తర్వాత రోహిత్ 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 72 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 175.60గా నిలిచింది.
Innings Break!#TeamIndia post a total of 173/8 on the board.
Over to our bowlers now ?
Scorecard – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/g77BzXkt8b
— BCCI (@BCCI) September 6, 2022
రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా తొందరగానే ఔటయ్యాడు. 29 బంతుల్లో అతని బ్యాట్ నుంచి 34 పరుగులు వచ్చాయి. రోహిత్-సూర్య మధ్య 58 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం ఉంది. నేటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా కూడా ఫ్లాప్ అయ్యారు. హార్దిక్ 13, హుడా 3 పరుగులు మాత్రమే చేయగలిగారు.
గత మ్యాచ్‌లో బ్యాడ్ షాట్ ఆడి ఔటైన రిషబ్ పంత్.. శ్రీలంకపై పెద్దగా రాణించలేక 13 బంతుల్లో 17 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్-విరాట్ కోహ్లీల ఫ్లాప్ షో
శ్రీలంకపై కేఎల్ రాహుల్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు. 7 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. అతని వికెట్‌ను మహేష్ తీక్ష తీశాడు. రెండో ఓవర్ నాలుగో బంతికి రాహుల్ ముందుకు వెళ్లి ఆడాలనుకున్నాడు. కానీ బంతి వెళ్లి అతని కాలికి తగిలింది. శ్రీలంక ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైర్ అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆసియా కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు.
అదే సమయంలో పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవలేకపోయాడు. మధుశంక వేసిన బంతికి యువ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో ఓవర్ నాలుగో బంతి విరాట్‌కు ప్రమాదకరంగా మారింది. విరాట్ అవుటైన వెంటనే రోహిత్ కూడా నిరాశ చెందాడు.
ఇరుజట్ల ప్లేయింగ్ XI –
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక




