IND vs SL T20: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. ఆసియా కప్‌ నుంచి అవుట్‌..

IND vs SL T20: తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్‌ చేతులెత్తేశారు. బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో రోహిత్ సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో సూపర్‌ 4లో భారత్‌ వరుసగా రెండు పరాజాయాలను...

IND vs SL T20: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. ఆసియా కప్‌ నుంచి అవుట్‌..
Ind Vs Srilanka
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 06, 2022 | 11:36 PM

IND vs SL T20: తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్‌ చేతులెత్తేశారు. బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో రోహిత్ సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో సూపర్‌ 4లో భారత్‌ వరుసగా రెండు పరాజాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో కుసల్‌ మెండిస్‌ 57 పరుగులు, పాతుమ్‌ నిస్సాంక (52) పరుగులు సాధించి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

భారత్‌ ఇచ్చిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించారు. అయితే పాతుమ్ నిస్సాంక అవుట్‌ అయిన తర్వాత శ్రీలం వరుస వికెట్లను కోల్పోయింది. నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా విజయం ఖరారు అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చి రాజపక్సా (25), దసున్‌ షనక (33) సమిష్టిగా ఆడడంతో శ్రీలంక విజయాన్ని అందుకుంది. ఇ

క అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ 72 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ 34 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్స్‌ మాత్రం 20 పరుగుల మార్క్‌ను దాటలేదు. టీమిండియా ఇంకో 10 నుంచి 20 పరుగులు చేసి ఉంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవి.

మరిన్ని క్రికెట్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..