IND vs SL: చివరి టీ20లో టీమిండియా చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక..

Ravi Kiran

|

Updated on: Jul 29, 2021 | 11:08 PM

India vs Sri Lanka 3rd T20 Live Score: ఇండియా, శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడు టీ20 కొలంబో వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్...

IND vs SL: చివరి టీ20లో టీమిండియా చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక..
India Vs Srilanka

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో లంకేయులు అద్భుత విజయాన్ని అందుకున్నారు. వన్ సైడ్‌డ్‌గా సాగిన ఈ పోరులో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్‌ను 2-1 గెలుచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది. విజయంలో కీలక పాత్ర పోషించిన హసరంగాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక బ్యాటింగ్‌లో ధనంజయ డిసిల్వా(23) మరోసారి రాణించాడు. భారత బౌలర్లలో రాహుల్ చాహార్ మూడు వికెట్లు పడగొట్టాడు.

కాగా, అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు.. కెప్టెన్ ధావన్(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడంతోనే వికెట్ల పతనం మొదలైంది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. బౌలర్ కుల్‌దీప్ యాదవ్(23) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. షనకా రెండు వికెట్లు.. చమీరా, మెండిస్ చెరో వికెట్ తీశారు. కరోనా కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో యువ టీమిండియా ఈ మ్యాచ్‌లో తడబడింది.

టీమిండియా: ధావన్(కెప్టెన్), గైక్వాడ్, పడిక్కల్, శాంసన్(వికెట్ కీపర్), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్ దీప్ యాదవ్, రాహుల్ చాహర్, సందీప్ వారియర్, చేతన్ సకరియా, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక: అవిష్క ఫెర్నాడో, భానుకా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, సమరవికరరామా , షనకా(కెప్టెన్), రమేష్ మెండిస్, హసరంగా, చమిక కరుణరత్నే, నిస్సాంకా, అఖిల ధనంజయ, చమీరా

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jul 2021 09:35 PM (IST)

    టీమిండియా 20 ఓవర్లకు 81/8

    టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. 20 ఓవర్లకు 81/8 పరుగులు చేసింది.

  • 29 Jul 2021 09:16 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో భారీ షాట్ ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా వరుణ్ చక్రవర్తి వెనుదిరిగాడు.

  • 29 Jul 2021 09:15 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. షనకా బౌలింగ్‌లో భారీ షాట్ ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా రాహుల్ చాహార్ వెనుదిరిగాడు.

  • 29 Jul 2021 09:07 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భువనేశ్వర్ కుమార్ లంక బౌలర్ హసరంగా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీనితో 55 పరుగుల వద్ద టీమిండియా 6 వికెట్ కోల్పోయింది.

  • 29 Jul 2021 08:47 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీష్ రాణా లంక బౌలర్ షనకాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 36 పరుగుల వద్ద టీమిండియా 5 వికెట్ కోల్పోయింది.

  • 29 Jul 2021 08:32 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన లంక బౌలర్ హసరంగా

    వెంటవెంటనే పెవిలియన్‌కు చేరిన గైక్వాడ్, శాంసన్

    25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

    పట్టుబిగించిన లంక బౌలర్లు..

  • 29 Jul 2021 08:29 PM (IST)

    5 ఓవర్లకు భారత్ 25/4

    నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

    జట్టు స్కోర్ కేవలం 25 పరుగులు

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన హసరంగా

    పట్టుబిగించిన లంక బౌలర్లు.. క్రీజులో భారత వైస్ కెప్టెన్

  • 29 Jul 2021 08:26 PM (IST)

    శాంసన్ ఔట్..

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    డకౌట్‌గా వెనుదిరిగిన శాంసన్

    హసరంగా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ

    24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్

  • 29 Jul 2021 08:23 PM (IST)

    పడిక్కల్ ఔట్..

    రెండో వికెట్ కోల్పోయిన భారత్

    9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ రనౌట్

    23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్

    క్రీజులోకి శాంసన్.. నిలదొక్కుకుంటున్న గైక్వాడ్

  • 29 Jul 2021 08:12 PM (IST)

    ధావన్ అవుట్..

    మొదటి బంతికే టీమిండియా కెప్టెన్ పెవిలియన్‌కు

    గోల్డెన్ డకౌట్ అయిన ధావన్

    చమీరా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగిన ధావన్

    ఐదు పరుగులకు మొదటి వికెట్ కోల్పోయిన భారత్

  • 29 Jul 2021 08:09 PM (IST)

    జట్టుకు దూరమైన నవదీప్ సైనీ..

    గాయం కారణంగా జట్టుకు దూరమైనా నవదీప్ సైనీ.

    రెండో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సైనీ

    ఎడమ భుజానికి తీవ్ర గాయం, స్కానింగ్ చేసే అవకాశం

    డాక్టర్ల పర్యవేక్షణలో సైనీ

  • 29 Jul 2021 08:07 PM (IST)

    శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్

    శ్రీలంక: అవిష్క ఫెర్నాడో, భానుకా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, సమరవికరరామా , షనకా(కెప్టెన్), రమేష్ మెండిస్, హసరంగా, చమిక కరుణరత్నే, నిస్సాంకా, అఖిల ధనంజయ, చమీరా

  • 29 Jul 2021 08:06 PM (IST)

    టీమిండియాలో ఒక్క మార్పు

    టీమిండియా: ధావన్(కెప్టెన్), గైక్వాడ్, పడిక్కల్, శాంసన్(వికెట్ కీపర్), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్ దీప్ యాదవ్, రాహుల్ చాహర్, సందీప్ వారియర్, చేతన్ సకరియా, వరుణ్ చక్రవర్తి

  • 29 Jul 2021 08:05 PM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

    నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గబ్బర్ సేన ఒక్క మార్పుతో బరిలోకి దిగింది.

Published On - Jul 29,2021 9:35 PM

Follow us