Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. భారత్‌తో సెంచూరియన్ టెస్టులో డి కాక్ దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు మాత్రమే చేశాడు.
దక్షిణాఫ్రికా తరఫున డి కాక్ వన్డే, టీ20 క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన డి కాక్, ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే, జట్టు పేలవమైన ప్రదర్శనతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
క్రికెట్ సౌతాఫ్రికా తన ప్రకటనలో, “వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో టెస్ట్ క్రికెట్‌కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించాడు” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
టెస్ట్ కెరీర్ ఇలా..
దక్షిణాఫ్రికా తరఫున డికాక్ మొత్తం 54 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అతను 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో డి కాక్ బ్యాట్ నుంచి మొత్తం ఆరు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు వచ్చాయి. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 141 పరుగులుగా నిలిచింది.
BREAKING: #Proteas wicket-keeper batsman, Quinton de Kock has announced his retirement from Test cricket with immediate effect, citing his intentions to spend more time with his growing family.
Full statement: https://t.co/Tssys5FJMI pic.twitter.com/kVO8d1e0Ex
— Cricket South Africa (@OfficialCSA) December 30, 2021
Also Read: IND vs SA: చారిత్రాత్మక విజయంలో ‘ఆ నలుగురిదే’ కీలకపాత్ర.. సెంచూరియన్‌లో సత్తా చాటిన పేస్ దళం..!
India Vs South Africa: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన సఫారీలు.. భారత్ ఘన విజయం…