IND VS SA, 4th T20I: నాలుగో టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. మరో విజయం దక్కేనా?

|

Jun 16, 2022 | 5:33 PM

శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 (IND VS SA, 4th T20I) జరగనుంది. సిరీస్‌లో టీమ్ ఇండియా 1-2తో వెనుకంజలో నిలిచింది. దీంతో నాల్గవ మ్యాచ్‌లో ప్లేయింగ్ XIలో కీలక మార్పు రానున్నట్లు తెలుస్తోంది.

IND VS SA, 4th T20I: నాలుగో టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. మరో విజయం దక్కేనా?
Ind Vs Sa, 4th T20i
Follow us on

IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్‌లో ఓటమి తర్వాత విశాఖపట్నంలో టీమిండియా ధీటుగా బదులిచ్చింది. టీ20 సిరీస్‌లో 1-2తో ఇరుజట్లు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాజ్‌కోట్‌లో 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. లేదంటే సిరీస్ కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయం కోసం టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అద్భుతంగా రాణించి విశాఖపట్నం టీ20 తరహా గేమ్‌ను పునరావృతం చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ప్లేయింగ్ ఎలెవన్‌తో టీమ్‌ఇండియా రంగంలోకి దిగుతుందనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. భారత జట్టులో ఏమైనా మార్పు ఉంటుందా? అనేది చూడాల్సి ఉంటుంది. గత మూడు T20 మ్యాచ్‌లలో, టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోయారు.

ప్రస్తుతం రిషబ్ పంత్ కెప్టెన్.. కాబట్టి, అతన్ని తప్పించడం కుదరదు. అవేష్ ఖాన్‌పై కచ్చితంగా వేటుపడే ఛాన్స్ ఉంది. తొలి, మూడో టీ20ల్లో అవేశ్‌ఖాన్‌ చాలా ఖరీదైన వాడిగా నిరూపించుకున్నాడు. అవేష్ ఖాన్ 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతను ఇప్పటివరకు సిరీస్‌లో 11 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేశాడు. అంటే అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 8 పరుగులకు దగ్గరగా ఉంది. మరి అవేశ్ ఖాన్‌ను 4వ టీ20లో ఉంచుతారా? లేదా తొలగిస్తారా? అనేది చూడాలి.

ఉమ్రాన్ మాలిక్‌కి అవకాశం వస్తుందా?

ఇవి కూడా చదవండి

అవేష్ ఖాన్ స్పెషాలిటీ అతని స్పీడ్. అతని కంటే వేగంగా బౌలింగ్ చేయగల ఆటగాడు టీమ్ ఇండియాకు ఉండటం విశేషం. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసి 22 వికెట్లు పడగొట్టాడు. అలాగే అతను 157 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. ఆ తర్వాత అతను టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా తరపున ఈ ఫాస్ట్ బౌలర్ అరంగేట్రం చేస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఫామ్, ఫిట్‌నెస్ ఉమ్రాన్ మాలిక్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆటగాడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. నాలుగో టీ20లో బరిలోకి దిగితే, టీమ్ ఇండియా విజయంలో కీలకంగా మారే ఛాన్స్ ఉంది.

టీమ్ ఇండియాలో ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందంటే?

ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.